ఒకే ఒక్క ప్ర‌యాణికుడితో చెన్నై చేరిన విమానం

చిత్రం భ‌ళారే విచిత్రం. అది సింగ‌పూర్ నుంచి వ‌చ్చిన ఎయిర్ ఇండియా ప్ర‌త్యేక విమానం. ప్ర‌యాణికుల‌కు స్వాగ‌తం ప‌లికేందుకు ప్ర‌భుత్వ అధికారులు, వైద్య బృందం, ఇమిగ్రేష‌న్‌, క‌స్ట‌మ్స్ అధికారులు విమానాశ్ర‌యంలో సిద్ధంగా ఉన్నారు. విమానం…

చిత్రం భ‌ళారే విచిత్రం. అది సింగ‌పూర్ నుంచి వ‌చ్చిన ఎయిర్ ఇండియా ప్ర‌త్యేక విమానం. ప్ర‌యాణికుల‌కు స్వాగ‌తం ప‌లికేందుకు ప్ర‌భుత్వ అధికారులు, వైద్య బృందం, ఇమిగ్రేష‌న్‌, క‌స్ట‌మ్స్ అధికారులు విమానాశ్ర‌యంలో సిద్ధంగా ఉన్నారు. విమానం త‌లుపులు తెరుచుకున్నాయి. ఆశ్చ‌ర్య‌పోవ‌డం అక్క‌డి వారి వంతు అయింది. ఎందుకంటే ఆ విమానం నుంచి కేవ‌లం ఒక్క‌రంటే ఒక్క వ్య‌క్తే విమానం నుంచి దిగాడు కాబ‌ట్టి.

రెండు రోజులు ఆల‌స్యంగా ఈ విష‌యం వెలుగు చూసింది. లాక్‌డౌన్ కార‌ణంగా సింగ‌పూర్‌లో చిక్కుకున్న 145 మంది భార‌తీయుల‌తో ఎయిర్ ఇండియా విమానం చెన్నైకి బ‌య‌ల్దేరింది. ఈ విమానంలో కోల్‌క‌తా మీదుగా చెన్నైకి ప్ర‌యాణించింది. కోల్‌క‌తాలో 144 మంది దిగారు. దీంతో  చెన్నైకి వ‌చ్చే స‌రికి ఒక్క ప్ర‌యాణికుడు మాత్ర‌మే మిగిలాడు.  అత‌నికి అధికారులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

అనంత‌రం అత‌నికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించి 14 రోజుల క్వారంటైన్‌కు త‌ర‌లించారు. అధికారులు మాట్లాడుతూ  విమానంలో వచ్చిన ప్రయాణికులలో 130 మందిని కోల్‌కతాలో దింపి, 15 మంది చెన్నైకు తీసుకొస్తున్నట్టు త‌మ‌కు స‌మాచారం అందిం ద‌న్నారు. అయితే 144 మంది కోల్‌కతాలో దిగార‌న్నారు. దీంతో చెన్నైకి వ‌చ్చిన ఆ ఒక్క‌డికి తాము సాద‌ర స్వాగ‌తం ప‌లికిన‌ట్టు అధికారులు తెలిపారు.

ఐదుసార్లు ట్రైచేసి నావల్లకాక వదిలేసాను

'పీవీ'ని ఆకాశానికి ఎత్తేసిన కెసిఆర్