పరుశురామ్.. అదిగో సినిమా

దర్శకుడు పరుశురామ్ పని బాగుంది. సెట్ మీద కన్నా వార్తల్లో సినిమాలు ఎక్కువగా వుంటున్నాయి. చైతన్య-14 రీల్స్ సినిమా అని అనుకుని మహేష్ దగ్గరకు వెళ్లారు. కానీ అక్కడ సంతృప్తికరమైన సినిమా ఇవ్వలేకపోయారు. వెనక్కు…

దర్శకుడు పరుశురామ్ పని బాగుంది. సెట్ మీద కన్నా వార్తల్లో సినిమాలు ఎక్కువగా వుంటున్నాయి. చైతన్య-14 రీల్స్ సినిమా అని అనుకుని మహేష్ దగ్గరకు వెళ్లారు. కానీ అక్కడ సంతృప్తికరమైన సినిమా ఇవ్వలేకపోయారు. వెనక్కు వచ్చి మళ్లీ 14 రీల్స్ లో కూర్చున్నారు. కానీ ఇప్పటి వరకు చైతన్య స్క్రిప్ట్ వినలేదు..ఒకె అనలేదు. అంతే కాదు వేరే సినిమా కూడా మొదలుపెట్టేసాడు.

ఈలోగా పరుశురామ్ మిత్రుడు బన్నీ వాస్ ఓ ప్రాజెక్టు గీతాలో ఫిక్స్ చేసేసారు. విజ‌య్ దేవరకొండ హీరోగా తన దగ్గర వున్న చుట్టాలబ్బాయి అనే పాత సబ్జెక్ట్ ను బన్నీవాస్ బయటకు తీసారు. కానీ ఈ సినిమా ఎప్పుడు వుంటుందో, లైన్లో ఎన్నో నెంబర్ అన్నది తెలియదు. 

ఇదిలావుంటే నిన్నటికి నిన్న ఓపెన్ డయాస్ మీద పరుశురామ్ నే త్వరలో ఓ మాంచి పవర్ ఫుల్ స్టోరీని హీరో బాలకృష్ణకు నెరేట్ చేయబోతున్నట్లు ప్రకటించేసారు. అది కూడా అల్లు అరవింద్ తో కలిసి అని చెప్పారు. అంటే అరవింద్ ఇటు బాలయ్యతో అటు విజ‌య్ దేవరకొండతో రెండు సినిమాలు పరుశురామ్ తో చేస్తారా?

ఇవన్నీ అలా వుంచితే పరుశురామ్ దగ్గర ఇబ్బడి ముబ్బడిగా అడ్వాన్స్ లు వున్నాయని టాక్. అలాంటి వాటిలో జ‌మానా కాలం నాడు తీసుకున్న భోగవిల్లి ప్రసాద్ అడ్వాన్స్ కూడా వుంది. కానీ ఆయనకు సినిమా చేసే ఆలోచన అయినా పరుశురామ్ కు వుందా అన్నది అనుమానం. మొత్తం మీద పరుశురామ్ చేతిలో సినిమాలు దండిగా వున్నాయి. సెట్ మీదకు వెళ్లడం మాత్రం కనిపించడం లేదు.

పాపం వాల్మీకి తరువాత సరైన సినిమా లేకుండా ఆఫీసు మెయింటెయిన్ చేసుకుంటూ వస్తున్నారు 14రీల్స్ జ‌నాలు. ఆ పవర్ ఫుల్ సబ్జెక్ట్ ఏదో బాలయ్య కు వాళ్ల తరపునే చెప్పవచ్చు కదా?