మైత్రీ కొంప ముంచిన అమావాస్య

రెండు భారీ సినిమాలు తీసి చేతులారా లాభాలు సంపాదించాలనుకున్న మైత్రీ మూవీస్ సంస్థ ఆశలను అమావాస్య నీరు కార్చేసింది. శుక్రవారం నాడు అమావాస్య రాకుండా వుండి వుంటే బాలకృష్ణ సినిమా డిసెంబర్ లో, మెగాస్టార్…

రెండు భారీ సినిమాలు తీసి చేతులారా లాభాలు సంపాదించాలనుకున్న మైత్రీ మూవీస్ సంస్థ ఆశలను అమావాస్య నీరు కార్చేసింది. శుక్రవారం నాడు అమావాస్య రాకుండా వుండి వుంటే బాలకృష్ణ సినిమా డిసెంబర్ లో, మెగాస్టార్ సినిమా సంక్రాంతికి వేసుకుని మంచి లాభాలు సంపాదించి వుండేవారు.

బాలకృష్ణ సినిమాను డిసెంబర్ 23న అని ఫిక్స్ అయిపోయారు ఎప్పుడో. అంతే కానీ బాలయ్య తిధులు, నక్షత్రాల విషయంలో పట్టుదలగా వుంటారని మరిచిపోయారు. టర్కీ వెళ్లారు, థియేటర్ల లెక్కలు వివరించారు. అంతా చెప్పారు, ఓకె అనుకున్నారు. వచ్చేసారు. కానీ ఎవరో చెప్పారు ఆ రోజు అమావాస్య అని బాలయ్యకు. అంతే మళ్లీ మొదటికి వచ్చింది వ్యవహారం.

సాధారణంగా ఇలాంటపుడు ఒకటి రెండు రోజుల ముందు ముహర్తం చూసుకుని, షో వేసుకుని, టికెట్ కట్ చేసుకుని, ఇలాంటి అడ్ఙస్ట్ మెంట్ లు చేస్తారు. కానీ అక్కడ వున్నది బాలయ్య..అలాంటి ఉమ్ముతడి వ్యవహారాలు ఆయనకు నప్పవు. సమస్యే లేదు డిసెంబర్ 23 మర్చిపోండి అన్నారు.

పోనీ డిసెంబర్ పది..పన్నెండు డేట్ ల్లో వద్దాం అనుకుంటే శృతిహాసన్ అందుబాటులో లేదు. ఆ వేళకు సినిమా రెడీ కాదు. దాంతో గత్యంతరం లేక సినిమాను సంక్రాంతికి మార్చేసారు. ఉరిమి ఉరిమి మొత్తానికి మెగాస్టార్ వాల్తేర్ వీరయ్య మీద పడింది. అమావాస్య ఎంత పని చేసిందో కదా?