బాలయ్య లాంటి సింగర్ ను ఈ భూమ్మీద చూడలేదు

శివశంకరి పాటతో బాలకృష్ణ ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నాడో అంతా చూశారు. పాటను ఖూనీ చేసి శ్రోతలకు ప్రత్యక్ష నరకం అంటే ఎలా ఉంటుందో చూపించాడు బాలయ్య. అయితే రామ్ గోపాల్ వర్మకు కూడా ఈ…

శివశంకరి పాటతో బాలకృష్ణ ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నాడో అంతా చూశారు. పాటను ఖూనీ చేసి శ్రోతలకు ప్రత్యక్ష నరకం అంటే ఎలా ఉంటుందో చూపించాడు బాలయ్య. అయితే రామ్ గోపాల్ వర్మకు కూడా ఈ పాట స్వర్గాన్ని చూపించిందట. ఈ భూమ్మీద బాలయ్య లాంటి సింగర్ ను చూడలేదంటున్నాడాయన. వీటితో పాటు కొంతమంది రాజకీయ నాయకులపై ఆర్జీవీ తన అభిప్రాయాల్ని వెటకారంగా, కాస్త కామెడీగా, ఇంకాస్త సూటిగా వ్యక్తంచేశాడు.

– బాలయ్య పాడిన పాటపై మీ అభిప్రాయం ఏంటి?
ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. సింగింగ్ కనిబెట్టిన తర్వాత ప్రపంచ చరిత్రలో నేను చూసిన అత్యుత్తమమైన గాయకుడు బాలయ్య. (వెటకారంగా..)

– మీ అప్ కమింగ్ మూవీస్ లో బాలయ్యతో పాట పాడిస్తారా?
నా రాబోయే సినిమాల్లో ఆయనతో నేను పాట పాడించలేను. ఎందుకంటే గాయకుడిగా ఆయన స్థాయి వేరు. ఆయన పాట ముందు నా సినిమాలు చాలా చిన్నవి.

– సడెన్ గా చంద్రబాబు ప్రత్యక్షమైతే ఏం అడుగుతారు?
నిజంగా ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారా లేదా నా చెవిలో చెప్పండి అని అడుగుతా

– ఉన్నఫలంగా లోకేష్ ప్రత్యక్షమైతే ఏం అడుగుతారు?
నీ గురించి మీ నాన్న మనసులో ఏమనుకుంటున్నాడో తెలుసా అని అడుగుతా

– పవన్ కల్యాణ్ ప్రత్యక్షమైతే…?
నేను పవన్ కు పెద్ద ఫ్యాన్. నా కంటే పెద్ద అభిమాని తెలుగు రాష్ట్రాల్లో పవన్ కు ఎవ్వరూ లేరని చెబుతా.

– పొలిటీషియన్లలో ఎవరి కామెడీ బాగుంటుంది?
నాకు లోకేష్ అంటే చాలా ఇష్టం

– కేసీఆర్ అంటే ఎందుకిష్టం
కేసీఆర్ మాటతీరు, ఆయన భాష, మేనరిజమ్స్ నాకు నచ్చుతాయి. ఆయన పరిపాలన గురించి నాకు తెలియదు.

– జగన్ పై ఎందుకు సినిమా తీయరు?
జగన్ జీవితంలో డ్రామా నాకు కనిపించలేదు. మరీ ముఖ్యంగా చంద్రబాబు జీవితంలో ఉన్నంత డ్రామా నేను జగన్ జీవితంలో చూడలేదు. భవిష్యత్తులో నాకు ఏదైనా పాయింట్ దొరికితే కచ్చితంగా సినిమా తీస్తాను.