మహేష్-త్రివిక్రమ్..సమ్ థింగ్..సమ్ థింగ్!

మహేష్ 28 వ సినిమా.త్రివిక్రమ్ దర్శకుడు. హారిక హాసిని నిర్మాణం. కానీ ఇప్పుడు ఈ సినిమా మీద వీర లెవెల్ లో గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. అసలు ఈ సినిమా వుంటుందా అనే అనుమానాలు…

మహేష్ 28 వ సినిమా.త్రివిక్రమ్ దర్శకుడు. హారిక హాసిని నిర్మాణం. కానీ ఇప్పుడు ఈ సినిమా మీద వీర లెవెల్ లో గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. అసలు ఈ సినిమా వుంటుందా అనే అనుమానాలు కూడా వినిపించేస్తున్నాయి. దర్శకుడు త్రివిక్రమ్ సరైన స్క్రిప్ట్ తయారు చేసి హీరో మహేష్ ను ఒప్పించలేకపోతున్నారు అన్నదే దీనికి కారణం అంటున్నారు. దీని మీద రకరకాల వదంతులు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ తాను స్వయంగా స్క్రిప్ట్ తయారీ మీద కూర్చోకుండా ఓ టీమ్ ను పెట్టుకుని పనులు అప్పగిస్తున్నారని మహేష్ బాబు భావిస్తున్నారట.

అసలు ఫస్ట్ షెడ్యూలు అర్థాంతరంగా ఆపేసి విదేశాలకు వెళ్లడం వెనుక, స్క్రిప్ట్ మొత్తం పకడ్బందీగా చేయమని త్రివిక్రమ్ టైమ్ ఇవ్వడం కోసమే అని అంటున్నారు. మధ్యలో స్క్రిప్ట్ వినిపించేందుకు లండన్ వెళ్లడానికి త్రివిక్రమ్ రెడీ అయినా వద్దని, మరింత సమయం తీసుకోమన్నారని బోగట్టా. ఇప్పుడు మహేష్ ఇండియా తిరిగి వస్తున్నారు. త్రివిక్రమ్ కలిసి మహేష్ కు ఆయనకు మధ్య స్క్రిప్ట్ విషయంలో వున్న గ్యాప్ లను ఫిల్ చేసుకోావాల్సి వుంది.

మహేష్ మాత్రం ఈసారి స్క్రిప్ట్ మీద చాలా పర్టిక్యులర్ గా వున్నారని, మొత్తం బౌండ్ స్క్రిప్ట్ ఇస్తే తప్ప సెట్ మీదకు వెళ్లడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది. అవసరం అయితే సినిమా ఆపేసి రాజమౌళి సినిమా మీదకు అయినా వెళ్తా కానీ, స్క్రిప్ట్ సంతృప్తి నివ్వకుండా ఈసారి సినిమా చేసేది లేదని మహేష్ భీష్మించుకుని కూర్చున్నట్లు తెలుస్తోంది.

ఈ మధ్య త్రివిక్రమ్ ఇతరత్రా పనుల మీద బిజీ అయిపోయారు. తన భార్య ను నిర్మాతగా మార్చారు. అందువల్ల ఆ సినిమాల కథలు, కాస్టింగ్ లు, క్వాలిటీ చెక్ లు త్రివిక్రమ్ చూసుకోవాల్సి వస్తోంది. అలాగే పవన్ సినిమాల వ్యవహారాలు, వాటికి స్క్రిప్ట్ లు ఇవ్వడం కూడా త్రివిక్రమ్ నెత్తిన వేసుకున్నారు.

పైగా రచయితగా త్రివిక్రమ్ ఎప్పుడూ పాస్ నే. కానీ కథకుడిగా కాదు. ఇప్పుడు అదే సమస్య గా మారుతోందని ఇండస్ట్రీ టాక్. ఇప్పుటికే ఎన్టీఆర్ తో సినిమా అనుకుని క్యాన్సిల్ అయింది. మళ్లీ మహేష్ తో కూడా అలాగే జరిగితే చాలా నామర్దగా వుంటుంది.