విశాఖలో ల్యాండ్ కానున్న మరో ఐటీ సంస్థ

విశాఖ ఐటీ రాజధానిగా మారబోతోంది. దానికి పునాదులు వైఎస్సార్ సీఎం గా ఉన్నపుడు బలంగా పడ్డాయి. విశాఖ రుషికొండ ప్రాంతాన్ని ఆయన ఆనాడు సెలెక్ట్ చేసి మరీ ఐటీ హిల్స్ కింద లోకేట్ చేసి…

విశాఖ ఐటీ రాజధానిగా మారబోతోంది. దానికి పునాదులు వైఎస్సార్ సీఎం గా ఉన్నపుడు బలంగా పడ్డాయి. విశాఖ రుషికొండ ప్రాంతాన్ని ఆయన ఆనాడు సెలెక్ట్ చేసి మరీ ఐటీ హిల్స్ కింద లోకేట్ చేసి అనేక ఐటీ కంపెనీలు రావడానికి శ్రీకారం చుట్టారు. అలా నెమ్మదిగా విశాఖ ఐటీ పరంగా తన గుర్తింపును పెంచుకుంటూ వస్తోంది.

హైదరాబాద్ తో పోల్చితే ఐటీ ఆదాయం విశాఖ తక్కువే అయినా ఇపుడు చూస్తే బ్రహ్మాండమైన ఫ్యూచర్ కనిపిస్తోంది అంటున్నారు. ఈ నెల మొదట్లో ప్రఖ్యాత ఇన్ఫోసిస్ సంస్థ విశాఖలో తన కార్యకలాపాలు ప్రారంభించి ఐటీ కి కేరాఫ్ విశాఖ అని చాటింది.

ఇపుడు అదే కోవలో నెదర్లాండ్స్ కి చెందిన ప్రముఖ ఐటీ సంస్థ రాండ్ స్టడ్ విశాఖలో ల్యాండ్ అవబోతోంది. చాలా తొందరలోనే ఈ సంస్థ కార్యకలాపాలు విశాఖలో స్టార్ట్ అవుతున్నాయని అంటున్నారు. ఈ సంస్థ ఇప్పటికే చెన్నై కేంద్రంగా గత ముప్పయ్యేళ్ళుగా నాలెడ్జి ప్రొసెసింగ్, అవుట్ సోర్సింగ్, రిక్రూట్మెంట్ ఆధారిత కార్యాకలాపాలను నిర్వహిస్తూ వస్తోంది.

దేశంలో తన రెండవ శాఖను మరో రాష్ట్రంలో ప్రారంభించాలని చాన్నాళ్ళుగా రాండ్ స్టాడ్ అనుకుంటోంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న చొరవ ఫలితంగా విశాఖకు ఆ రెండవ శాఖ రాబోతోంది. విశాఖలో ఏర్పాటు కానున్న రాండ్ స్టాడ్  ఐటీ సంస్థ ద్వారా మొదటి దశలో 200 మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయి.

దశలవారీగా ఆ సంఖ్య వేయి పై దాటి ఇంకా విస్తరిస్తుంది అని అంటున్నారు. ఏపీలో వైసీపీ సర్కార్ ఏర్పాటు అయ్యాక వరసబెట్టి ప్రఖ్యాత ఐటీ కంపెనీలు విశాఖ వైపు చూస్తూండడం శుభ పరిణామం. విశాఖకు ఏం చేసింది వైసీపీ సర్కార్ అని విపక్షాలు విమర్శలు తరచూ చేస్తాయి. వాటికి ఈ ఐటీ కంపెనీల రాక ఒక బలమైన సమాధానం అని వైసీపీ నేతలు చెబుతున్నారు.