రామోజీ హోటళ్లలోనే బార్లు ఉండాలా?

మద్య నిషాదం అంటూ ఈనాడు పత్రిక రాసిన కధనానికి సాక్షి కౌంటర్ ఇచ్చింది. అందులో ఒక భాగంలో రామోజీ ఫిలిం సిటీలో మద్యం సరఫరా గురించి ప్రస్తావించారు. Advertisement మద్యంతో నిరుపేదల ఇళ్లు, ఒళ్లు…

మద్య నిషాదం అంటూ ఈనాడు పత్రిక రాసిన కధనానికి సాక్షి కౌంటర్ ఇచ్చింది. అందులో ఒక భాగంలో రామోజీ ఫిలిం సిటీలో మద్యం సరఫరా గురించి ప్రస్తావించారు.

మద్యంతో నిరుపేదల ఇళ్లు, ఒళ్లు గుల్ల కాకూడదన్న ముఖ్యమంత్రి ఆలోచనకు ప్రతిరూపమే ‘వాకిన్‌ స్టోర్స్‌’. నిజానికి రామోజీ హోటళ్లలో ఉండే బార్లు ఒక రకంగా వాకిన్‌ స్టోర్లే. అక్కడకు వెళ్లిన వారు నచ్చిన మద్యాన్ని కొనుక్కోవచ్చు!. 

రాష్ట్రంలోని మాల్స్‌లో ఇలా వాకిన్‌ స్టోర్స్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయటం మాత్రం రామోజీకి నచ్చటం లేదు. ఇది కూడా మద్యం విక్రయాలను పెంచటానికేనన్నది ‘ఈనాడు’ భాష్యం. 

ఫుల్‌ బాటిళ్లనే విక్రయించే ఈ స్టోర్లకు ఎగువ మధ్యతరగతి, ఉన్నతవర్గాల వారే వెళతారని, పేదలు, దిగువ మధ్య తరగతి వర్గాల వారు వాటి జోలికెళ్లేందుకు సాహసించరని రామోజీకి తెలియదా? దీనివల్ల ఆయా వర్గాల్లో మద్యపానం తగ్గుతుందనేది వేరే చెప్పాలా? 

బాబు మాదిరి విచ్చలవిడిగా బెల్టు దుకాణాల్ని పెంచటమే మంచిదా? మద్యం విక్రయాలు తగ్గాయని చెబుతున్న అధికారిక లెక్కలు వీళ్లకు కనిపించవా? వాస్తవాలు అక్కర్లేదా? అని రాశారు.