డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పేరుతో పొద్దున్నుంచి ఆడియో లీకుల పేరుతో సోషల్ మీడియాను ఒక కుదుపు కుదిపేస్తున్నాయి. టీడీపీ దాని అనుకూల మీడియాలపై ఆర్జీవి తనపైన శైలిలో కౌంటర్లు ఇస్తున్నారు. పొద్దున్న టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై రసగుల్లా అంటూ చేసిన ర్యాగింగ్ మర్చిపోక ముందే టీడీపీ అనుకూల మీడియా యాంకర్ పై సెటైర్లు వేశారు.
ఆ ఆడియోలో వర్మ మాట్లాడుతూ.. సాంబ నువ్వు ఎవరైనా తిట్టించాలనుకుంటే రోడ్డుపై పని పాట లేని వారిని తీసుకువచ్చి నోటికి వచ్చినట్లు మాట్లాడితే నీ 0.5 ఛానెల్ కు ఉన్న పేరు కూడా పోతుందని.. అందుకే గూంబ విషయం తెలిసినా వారిని పిలిచి డిబెట్లు పెడితే మర్యాద నిలబడుతుందని సలహా ఇచ్చారు.
నేను ఎటువంటి సినిమా తీయబోతున్నను అనేది ముందు తెలుసుకోని డిబెట్లు పెట్టాలని హితవు చెప్పారు. నీకు బుద్ది లేకపోతే నీకు ఉద్యోగం ఇచ్చిన వాడికి అయిన విషయం తెలుసుకోవాలని లేకపోతే 0.5 ఛానెల్ తో పాటు నీ ఉద్యోగం పోతాయని అందుకే విషయం తెలుసుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నాట్లు చెప్పారు.
మొత్తానికి ఆర్జీవి సినిమా తీయకముందే టీడీపీ దాని అనుకూల మీడియాల ద్వారా సినిమా ప్రమోషన్స్ లో మాత్రం దూసుకెళ్తున్న దూసుకెళ్తోంది అనేదానిలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ ఆడియోలపై రేపటి నుండి టీడీపీ నేతలపై నుండి ఎటువంటి స్పందన వస్తుందనేది అసక్తి నెలకొంది.