టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి రామ్ పై తనదైన స్టైల్ లో సమాధానం చెప్పారు డైరక్టర్ రాం గోపాల్ వర్మ. వర్మ మాట్లాడినట్లు ఇవాళ ఒక ఆడియో టేపు బయటికి వచ్చింది. అందులో వర్మ.. పట్టాభిపై ఒక వైపు ప్రేమ మరోవైపు కోపం రెండు చూపించారు. వర్మ పట్టాభి రామ్ కు రసగుల్లా అని మంచి స్వీట్ పేరు పెట్టారు.
వర్మ ఆడియోలో మాట్లాడుతూ.. వాడెవడో తెలియదు ముద్దుగా, బొద్దుగా ఎర్రగా అచ్చం రసగుల్లా లాగా ఉండే పట్టాభి.. నేను తీసే సినిమా గురించి ఏమీ తెలియకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఒక వైపు నేను చెత్త డైరక్టర్ అంటూనే రసగుల్లా.. టెన్షన్ పడి పార్టీలోని అందరిని టెన్షన్ పెడుతున్నరంటూ సెటైర్ వేశారు.
పట్టాభి రసగుల్లా లాంటి వాడని అని.. రసగుల్లా అనేది తియ్యగా, చెక్కెరలా ఉండాలి తప్పా మిరపకాయ లాగా ఫీల్ అవుతే చాలా చండాలంగా ఉందన్నారు. ఎక్కువ టెన్షన్ పడితే బిపి, ఘగర్ వచ్చి చస్తామంటూ సలహ ఇచ్చారు.
నేను ఎవరికి ఉపయోగపడకపోవచ్చు. కానీ రసగుల్లా ఫ్యామిలీకి రసగుల్లా ఆవసరం ఉంటుందని, ఇప్పటికైనా నన్ను గెలకపోతే మంచిదన్నారు. మొత్తానికి టీడీపీ నేతలు దగ్గర ఉండి వర్మ సినిమాకు ఫ్రీ పబ్లిసిటి ఇస్తున్నట్లు ఆర్ధం అవుతుంది.