జ‌గ‌న్‌తో యువ హీరో భేటీ… హాట్‌హాట్ చ‌ర్చ‌

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను యువ హీరో మంచు మ‌నోజ్ సోమ‌వారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. మంచు మ‌నోజ్ అన్న మంచు విష్ణుకు సీఎం జ‌గ‌న్‌తో ద‌గ్గ‌రి బంధుత్వం ఉంది. సీఎం జ‌గ‌న్ సొంత చిన్నాన్న కూతురికి…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను యువ హీరో మంచు మ‌నోజ్ సోమ‌వారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. మంచు మ‌నోజ్ అన్న మంచు విష్ణుకు సీఎం జ‌గ‌న్‌తో ద‌గ్గ‌రి బంధుత్వం ఉంది. సీఎం జ‌గ‌న్ సొంత చిన్నాన్న కూతురికి మంచు విష్ణుతో వివాహ‌మైన సంగ‌తి తెలిసిందే. మంచు సోద‌రుల‌కు వ‌రుస‌కు జ‌గ‌న్ బావ అవుతారు.

మ‌రోవైపు ''మా'' ఎన్నిక‌ల నేప‌థ్యంలో సీఎంను మ‌నోజ్ కల‌వ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. మంచు విష్ణు ''మా'' అధ్య‌క్ష బ‌రిలో నిల‌వ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్‌ను క‌లిసిన విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా మ‌నోజ్ వెల్ల‌డించారు. త‌న ఫీలింగ్స్‌ని ట్వీట్ రూపంలో మ‌నోజ్ వెల్ల‌డించారు.

''సీఎం జగన్‌ను కలవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. భవిష్యత్‌ కోసం ఆయన చేస్తున్న ప్రణాళికలు.. ముందుచూపు, దూరదృష్టి నన్ను బాగా ఆకర్షించాయి. రాష్ట్ర అభివృద్ధిపై మీకున్న దార్శనికతకు ముగ్ధుడినయ్యాను. మంచి చేస్తున్న మీలాంటి వ్యక్తికి దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. మీ పరిపాలనకు ఇవే నా శుభాకాంక్షలు '' అని మ‌నోజ్‌ ట్వీట్‌ చేశారు. 

అయితే సీఎం జ‌గ‌న్‌ను మ‌నోజ్ ఒంట‌రిగా క‌ల‌వ‌డం టాలీవుడ్‌లో హాట్‌హాట్ చ‌ర్చ‌కు దారి తీసింది. ''మా'' ఎన్నిక‌ల‌కు, సీఎంతో భేటీకి ఏమైనా లింక్ ఉందా? అనే అంశంపై ర‌క‌ర‌కాల చ‌ర్చ జ‌రుగుతోంది.