బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో అఖిల్ హీరోగా తయారవుతున్న సినిమాకు హీరోయిన్ ఎంపిక సమస్యగా మారిన సంగతి తెలిసిందే. దానివల్ల సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది. లేటెస్ట్ గా హీరోయిన్ ఛాయిస్ ఆఖరికి పూజాహెగ్డే దగ్గర ఆగింది. కానీ ఇప్పుడు ఇంకో సమస్య ఎదురయింది. పూజా డేట్ లు ఇప్పడప్పుడే లేవు అని తెలుస్తోంది. కానీ హీరో పూజానే కావాలని అంటున్నట్లు బోగట్టా.
దాంతో పూజాహెగ్డేను ఫైనల్ చేసి, సినిమాను ఆమె డేట్ లు ఇచ్చేవరకు ఆపే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే నెల్లలో ఓసారి వారంరోజులు, ఆ తరువాత నవంబర్ లో మరికొన్ని రోజులు పూజాహెగ్డే డేట్ లు కేటాయిస్తా అని చెప్పినట్లు తెలుస్తోంది.
దాంతో ఆమె డేట్ లకు అనుగుణంగానే సినిమా షెడ్యూలు ప్లాన్ చేసే పనిలో గీతా2 సంస్థ వున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల అఖిల్ సినిమా 2020 సమ్మర్ కు తప్ప ఈలోగా వుండదని బోగట్టా. కానీ నాగార్జున-చైతన్యల బంగార్రాజు సినిమా కూడా సమ్మర్ నే టార్గెట్ చేయడం విశేషం.