రాస‌లీల‌లు, ప‌చ్చిబూతులు.. క‌ర్ణాట‌క రాజ‌కీయం!

ఒక‌వైపు అధికార భార‌తీయ జ‌న‌తా పార్టీ ముఖ్య నేత ర‌మేష్ జ‌ర్కిహోళి వీడియోల వివాదం కొన‌సాగుతూ ఉండ‌గా, ఈ విష‌యంలో ప్ర‌త్య‌ర్థుల‌పై మాట‌ల దాడి కొన‌సాగిస్తూ ఉన్నారాయ‌న‌. ప్ర‌త్యేకించి త‌న‌ను ట్రాప్ లో ఇరికించార‌ని…

ఒక‌వైపు అధికార భార‌తీయ జ‌న‌తా పార్టీ ముఖ్య నేత ర‌మేష్ జ‌ర్కిహోళి వీడియోల వివాదం కొన‌సాగుతూ ఉండ‌గా, ఈ విష‌యంలో ప్ర‌త్య‌ర్థుల‌పై మాట‌ల దాడి కొన‌సాగిస్తూ ఉన్నారాయ‌న‌. ప్ర‌త్యేకించి త‌న‌ను ట్రాప్ లో ఇరికించార‌ని ఈ క‌మ‌లం పార్టీ నేత వాపోతున్నాడు. అందుకు కార‌ణంగా కాంగ్రెస్ నేత డీకే శివ‌కుమార్ పేరును పేర్కొంటూ ఉన్నాడు.

డీకే శివ‌కుమార్ ను తీవ్రంగా నిందించాడు ర‌మేష్ జ‌ర్కిహోళి. స‌హ‌నం కోల్పోయి ప‌చ్చిబూతులు మాట్లాడారు. ఈ క్ర‌మంలో డీకేశిని హిజ్రా అని నిందించాడు ఈ బీజేపీ నేత‌. డీకే శివ‌కుమార్ హిజ్రా అని, అందుకే త‌న‌ను ఈ త‌ర‌హా స్కామ్ లో ఇరికించాడంని అంటూ జ‌ర్కిహోళి ధ్వ‌జ‌మెత్తారు.

మ‌గాడైతే త‌న‌ను డైరెక్టుగా ఎదుర్కొనాల‌ని, కొజ్జావాడు కాబ‌ట్టే ఇలా సీడీల స్కామ్ కు పాల్ప‌డ్డాడ‌ని జ‌ర్కిహోళి విమ‌ర్శించారు. ఈ విష‌యంపై డీకేశి స్పందించారు. ర‌మేష్ చాలా ఫ్ర‌ష్ట్రేష‌న్ లో ఉన్నార‌ని, అందుకే అలా స్పందిస్తున్నారంటూ ప్ర‌తి విమ‌ర్శ‌లు చేశారు.

మొత్తానికి ఏపీలో తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న త‌న‌యుడు ఒక ర‌కం బూతులు మాట్లాడుతూ అనునిత్యం రెచ్చిపోతూ ఉంటే, క‌ర్ణాట‌క‌లో మ‌రో అడుగు ముందుకేసి నేత‌లు విమ‌ర్శించుకుంటూ ఉన్నారు.