రెండు సినిమాలు చూసిన తరువాత సంక్రాంతి మీద మోజు పెంచుకున్న హీరోల్లో నాగార్జున కూడా వున్నారు. మలయాళ రీమేక్ ను ఇద్దరు ముగ్గురు రైటర్లకు ఇచ్చి, ఆఖరుకు డ్యాన్స్ డైరక్టర్ విజయ్ బిన్నితో ఫిక్స్ అయిపోయారు.
రీమేక్‌కు విజయ్ బిన్ని ఇచ్చిన ట్రీట్ మెంట్ బాగా నచ్చిందట నాగ్ కు. అందుకే అతగాడికి అవకాశం ఇచ్చారు. ఇప్పటి నుంచి నాన్ స్టాప్‌గా షూట్ చేసి జనవరికి సినిమాను వదలాలని ఫిక్స్ అయిపోయారట.
ఈ మేరకు నిర్మాత చిట్టూరి శ్రీను తన ఏర్పాట్లు తాను చేసుకోవడం ప్రారంభించేసారు. పైగా సినిమా షూట్ కన్నా ముందుగా టీజర్ షూట్ చేసి నాగ్ బర్త్ డే కు విడుదల చేసేందుకు సన్నాహాలు ప్రారంభించేసారు. అంటే ఇదేదో సీరియస్ వ్యవహారమే అన్న మాట. అటు విజయ్ దేవరకొండ ఇటు రవితేజ సినిమాలు పక్కా అంటుంటే, నిన్నటికి నిన్న మహేష్ బాబు కూడా తను సంక్రాంతికి వస్తున్నా అని ఓపెన్ గా అనౌన్స్ చేస్తే, ఇప్పుడు నాగ్ కూడా సై అంటున్నారు.
ఇప్పటికి సంక్రాంతికి ప్రకటించిన సినిమాల సంఖ్య ఆరుకు చేరింది. వీటిలో కనీసం రెండు డ్రాప్ అవ్వాల్సి వుంటుంది. అదే కనుక పవన్ కళ్యాణ్ ఓజి కూడా అదే లిస్ట్ లో జాయిన్ అయితే మూడు నాలుగు డ్రాప్ అయిపోవాల్సిందే.