మోదీపై దుమారం రేపుతున్న‌ శివ‌సేన ప‌త్రిక సంపాద‌కీయం

మోడీ స‌ర్కార్‌పై చైనా కేంద్రంగా శివ‌సేన తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు గుప్పించింది. శివ‌సేన త‌మ అధికార ప‌త్రిక సామ్నాలో ప్ర‌ధాని మోడీపై తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. ఈ సంపాద‌కీయంలో ల‌ఢాఖ్‌లోని గ‌ల్వాన్ లోయ‌లో చైనా…

మోడీ స‌ర్కార్‌పై చైనా కేంద్రంగా శివ‌సేన తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు గుప్పించింది. శివ‌సేన త‌మ అధికార ప‌త్రిక సామ్నాలో ప్ర‌ధాని మోడీపై తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. ఈ సంపాద‌కీయంలో ల‌ఢాఖ్‌లోని గ‌ల్వాన్ లోయ‌లో చైనా సైనికుల‌తో భార‌త సైనికులు ఘ‌ర్ష‌ణ నాట‌కం ఆడుతున్నార‌ని మండిప‌డింది.

సామ్నా సంపాద‌కీయంలో మోడీ స‌ర్కార్‌పై తీవ్ర ప‌ద‌జాలంతో తూర్పార‌ప‌ట్టారు. బీహార్ ఎన్నిక‌ల్లో భార‌త సైనికుల త్యాగాన్ని సొమ్ము చేసుకోవాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ యోచిస్తున్నార‌ని ఆరోపించారు. బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు 'కుల, ప్రాంతీయ కార్డు' రాజకీయాలు ఆడుతున్నారని సంపాద‌కీయంలో ధ్వ‌జ‌మెత్తారు.

‘ఈ రోజు, నేను బీహార్ ప్రజలతో మాట్లాడుతున్నాను, ప్రతి బిహారీ చైనా సైన్యంతో పోరాడుతున్న వారి శౌర్యం గురించి గర్వపడుతున్నారు. నేను బిహారి రెజిమెంట్‌ అమరులకు నివాళులు అర్పిస్తున్నాను’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించ‌డంపై సామ్నా సంపాద‌కీయంలో చీల్చి చెండాడారు. గ‌ల్వాన్ వ్యాలీలో భార‌త్‌-చైనా సైనికుల ఘ‌ర్ష‌ణ త‌ర్వాత ప్ర‌ధాని ఈ మాట‌ల‌న‌డం శివ‌సేన త‌న నిర‌స‌న‌ను సామ్నా సంపాద‌కీయంలో వ్య‌క్తం చేసింది.

బీజేపీ ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి కాంగ్రెస్ కంటే తీవ్రంగా శివ‌సేన మోదీ విధానాల‌ను త‌ప్పు ప‌ట్ట‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు బీజేపీ -శివ‌సేన క‌వ‌ల పిల్ల‌ల్లా క‌లిసి ఉండేవి. మ‌హారాష్ట్ర‌లో అధికారాన్ని పంచుకునే క్ర‌మంలో ఆ రెండు పార్టీల మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో మోదీ అంటే శివ‌సేన‌కు అస‌లు గిట్ట‌డం లేదు. మోదీ యుద్ధ రాజ‌కీయాల‌ను సామ్నా సంపాద‌కీయంలో ఏ స్థాయిలో దుయ్య‌బ‌ట్టిందో ప్ర‌తి ఒక్క‌రూ తెలుసుకోవాల్సిందే. అదెలా సాగిందో చూడండి.

‘ ప్రధాని మోదీ ఇటువంటి రాజకీయాల్లో నిపుణుడు. గల్వాన్‌ వ్యాలీలోని 'బీహార్ రెజిమెంట్స  ప‌రాక్ర‌మాన్ని ప్ర‌ధాని ప్రశంసించారు. అంతకుముందు, దేశం సరిహద్దుల్లో ముప్పును ఎదుర్కొన్నప్పుడు మహర్, మరాఠా, రాజ్‌పుత్, సిక్కు, గూర్ఖా, డోగ్రా రెజిమెంట్లు పనిలేకుండా కూర్చున్నాయా?  కేవ‌లం  బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారత సైన్యంలో కులం, ప్రాంతాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలాంటి రాజకీయాలు ఒక వ్యాధి వంటివి. ఇది కరోనా వైరస్ కంటే తీవ్రమైనది’ అని వ్యాఖ్యానించడం దుమారం రేపుతోంది.

నాయకుడంటే అర్థం తెలిసింది