ట్రేడ్ టాక్: ఓటీటీ వైపు అడుగులు

థియేటర్లు ఇవాళ కాకపోతే రేపు ఓపెన్ అవుతాయంటూ వంద రోజులకు పైగా ఎదురు చూసారు నిర్మాతలు. మరో వంద రోజులయినా పరిస్థితిలో మార్పు వచ్చేలా లేదని చాలా మంది రియలైజ్ అయిపోయారు. అందుకే నెమ్మదిగా…

థియేటర్లు ఇవాళ కాకపోతే రేపు ఓపెన్ అవుతాయంటూ వంద రోజులకు పైగా ఎదురు చూసారు నిర్మాతలు. మరో వంద రోజులయినా పరిస్థితిలో మార్పు వచ్చేలా లేదని చాలా మంది రియలైజ్ అయిపోయారు. అందుకే నెమ్మదిగా ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నారు.

రానా దగ్గుబాటి సహ నిర్మాతగా వున్న ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రాన్ని చడీ చప్పుడు లేకుండా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేసేసారు. 

తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఓటీటీకి వెళ్లిన మొదటి చెప్పుకోతగ్గ చిత్రం ఇదే అనుకోవచ్చు. ఇప్పటికే తమిళం, హిందీ చిత్రాలు ఓటిటిలో విడుదల చేసారు.

మలయాళ, కన్నడ చిత్రాలు కూడా ఓటిటి రిలీజ్‌కి షెడ్యూల్ చేసారు. విశాల్ కూడా చక్ర చిత్రాన్ని ఓటిటి ద్వారా విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. 

ఈ ఏడాది చివరి వరకు సినీ వ్యాపారం సాధారణ స్థితికి రాదనే భావన రోజురోజుకీ బలపడుతూ వుండడంతో పలు మీడియం బడ్జెట్, లో బడ్జెట్ చిత్రాలను ఓటిటి రిలీజ్‌కి లైనప్ చేస్తున్నారు.

జులై నుంచి పలు తెలుగు చిత్రాలు సరాసరి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో దర్శనం ఇవ్వబోతున్నాయి.