వావ్‌…రియాల్టీ షో హోస్ట్‌గా స్టార్ హీరోయిన్‌!

నిజంగా ఇది ఆశ్చ‌ర్య ప‌రిచే వార్తే. ఒక్క అక్కినేని అభిమానుల‌కు మాత్ర‌మే కాదు ప్ర‌తి ఒక్క‌రినీ ఆనంద‌ప‌రిచే స‌మాచారం. బుల్లితెర‌పై రియాల్టీ షోల‌కు అత్య‌ధిక ప్ర‌జాద‌ర‌ణ ఉంటుంది. ఎందుకంటే ఇత‌రుల వ్య‌క్తిగ‌త జీవితాల్లో తొంగి…

నిజంగా ఇది ఆశ్చ‌ర్య ప‌రిచే వార్తే. ఒక్క అక్కినేని అభిమానుల‌కు మాత్ర‌మే కాదు ప్ర‌తి ఒక్క‌రినీ ఆనంద‌ప‌రిచే స‌మాచారం. బుల్లితెర‌పై రియాల్టీ షోల‌కు అత్య‌ధిక ప్ర‌జాద‌ర‌ణ ఉంటుంది. ఎందుకంటే ఇత‌రుల వ్య‌క్తిగ‌త జీవితాల్లో తొంగి చూడ‌డం మాన‌వ బ‌ల‌హీన‌త‌. దీన్ని సొమ్ము చేసుకోవ‌డంలో బుల్లితెర స‌క్సెస్ సాధించింది.

ఇక రియాల్టీ షో విష‌యానికి వ‌స్తే…తెలుగు స‌మాజాన్ని “బిగ్‌బాస్” బాగా ఆక‌ట్టుకుంద‌నే చెప్పాలి. దీంతో ఇప్ప‌టికి తెలుగులో మూడు బిగ్‌బాస్ రియాల్టీ షోలు విజ‌య‌వంతంగా సాగాయి. లాక్‌డౌన్ కార‌ణంగా నాలుగో సీజ‌న్‌కు బ్రేక్ ప‌డింది. క‌రోనా స‌మ‌స్య లేక‌పోయిన‌ట్టైతే ఈ పాటికి నాలుగో సీజ‌న్ కూడా న‌డుస్తుండేది.

లాక్‌డౌన్ స‌డ‌లింపుల నేప‌థ్యంలో బిగ్‌బాస్ రియాల్టీ షో నాలుగో సీజ‌న్‌ను ప్రారంభించేందుకు “స్టార్ మా” స‌మాయ‌త్తం అవుతోంది. ఈ నేప‌థ్యంలో కొంద‌రి కంటెస్టెంట్ల పేర్లు కూడా లీక్ అయిన విష‌యం తెలిసిందే. ఈ సీజ‌న్‌లో బిత్తిరి స‌త్తి , వ‌ర్షిణి, మంగ్లీ, అఖిల్ స‌ర్తాక్, త‌రుణ్‌ త‌దిత‌రులు కంటెస్టెంట్ల‌గా ఉంటార‌ని విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీన్ని వీరెవ‌రూ ఇంత వ‌ర‌కూ ఖండించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఇక ఈ సీజ‌న్  హోస్ట్ ఎవ‌ర‌నే అంశంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. బిగ్‌బాస్ సీజ‌న్‌-1కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన ఎన్టీఆర్ మ‌రోసారి అల‌రించ‌నున్నార‌నే ప్ర‌చారం కూడా సాగింది.  తాజాగా స్టార్ హీరోయిన్‌, అక్కినేని వారి కోడ‌లైన స‌మంత హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌నే ప్ర‌చారం టాలీవుడ్‌లో ఊపందుకుంది.

ఇంత వ‌ర‌కూ బిగ్‌బాస్ మూడు సీజ‌న్ల‌లో కూడా హీరోలే క‌నిపించారు. దీంతో ఈ ద‌ఫా కాస్తా వినూత్నంగా నిర్వ‌హించేందుకు బిగ్‌బాస్ నిర్వాహ‌కులు ప్లాన్ చేశార‌ని స‌మాచారం. ఇందులో భాగంగా నాలుగో సీజ‌న్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని ప్ర‌ముఖ హీరోయిన్ స‌మంత‌ను నిర్వాహ‌కులు క‌లిశార‌ని తెలిసింది.

ఈ ప్ర‌చారం నిజ‌మే అయితే మాత్రం బిగ్‌బాస్ రియాల్టీ షో నాలుగో సీజ‌న్  త‌ప్ప‌క ఆక‌ట్టుకుంటుంది.  బిగ్‌బాస్ మూడో సీజ‌న్‌లో ఒక వారం హీరో నాగార్జున‌కు బ‌దులు ర‌మ్య‌కృష్ణ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించి అద‌ర‌గొట్టిన విష‌యం తెలిసిందే. అవ‌కాశాలు రావాలే కానీ,  తాము ఏ విష‌యంలోనూ హీరోల‌కు త‌క్కువేం కాద‌ని హీరోయిన్‌లు నిరూపించుకుంటున్నారు. 

నాయకుడంటే అర్థం తెలిసింది

మళ్ళీ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ ?