నిజంగా అనుష్కను ప్రేమిస్తే దాచేవాడ్ని కాదు

అనుష్కతో ఎఫైర్ అంటూ వస్తున్న పుకార్లపై మరోసారి స్పందించాడు ప్రభాస్. సాహో ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడిన ప్రభాస్, ఈసారి అనుష్కపై మరింత క్లారిటీ ఇచ్చాడు. నిజంగా తను అనుష్కను ప్రేమిస్తే దాన్ని దాచాల్సిన…

అనుష్కతో ఎఫైర్ అంటూ వస్తున్న పుకార్లపై మరోసారి స్పందించాడు ప్రభాస్. సాహో ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడిన ప్రభాస్, ఈసారి అనుష్కపై మరింత క్లారిటీ ఇచ్చాడు. నిజంగా తను అనుష్కను ప్రేమిస్తే దాన్ని దాచాల్సిన అవసరం లేదన్నాడు. ఎప్పుడో తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టేవాడినని అంటున్నాడు.

“నిజంగా అనుష్కతో ఎఫైర్ ఉంటే.. రెండేళ్లపాటు తప్పించుకొని తిరగడం చాలాకష్టం. ఎక్కడో ఒకచోట, ఏదో ఒక టైమ్ లో మేం దొరికేవాళ్లం. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా దొరికిపోతాం కదా. ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అయినా నిజంగా నేను అనుష్కను ప్రేమిస్తే దాచాల్సిన అవసరం లేదు కదా. నా వ్యక్తిగత జీవితాన్ని దాచాలని నేను ఎప్పుడూ అనుకోను. కానీ నేను సైలెంట్ గా ఉన్న ప్రతిసారి గాసిప్స్ ఎక్కువైపోతున్నాయి.”

ఇలా అనుష్కకు తనకు మధ్య ఎలాంటి ఎఫైర్ లేదనే విషయాన్ని మరోసారి స్పష్టంచేశాడు ప్రభాస్. ఈ పుకార్లు ఆగాలంటే తను అర్జెంట్ గా పెళ్లి చేసుకోవడం ఒక్కటే మార్గమంటున్నాడు. పైగా అమ్మ బాగా విసిగిస్తోందని, ఇక పెళ్లి చేసుకోక తప్పదని అంటున్నాడు.

“నేను పెళ్లి చేసుకుంటే చూడాలనేది మా అమ్మ కోరిక. ప్రతి అమ్మ ఇలానే అనుకుంటుంది కదా. నా పెళ్లికి సంబంధించిన పుకార్లపై ఆమెకు చాలా కాల్స్ వస్తున్నాయి. దాంతో అమ్మ విసుగెత్తిపోతోంది. అనుష్కతో ఎఫైర్ అంటూ వస్తున్న పుకార్లపై కూడా అమ్మ చాలా సీరియస్ గా ఉంది. నేను అర్జెంట్ గా ఎవరో ఒకర్ని పెళ్లి చేసుకొని, ఈమె నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేవరకు.. అనుష్కకు నాకు ఎఫైర్ అంటూ పుకార్లు వస్తూనే ఉంటాయి.”

తను ఎప్పుడు పెళ్లి చేసుకుంటానో చెప్పలేను కానీ, తనది మాత్రం కచ్చితంగా ప్రేమ వివాహమే అవుతుందంటున్నాడు ప్రభాస్. ఓవైపు అనుష్కను ప్రేమించడం లేదని చెబుతూనే, మరోవైపు లవ్ మ్యారేజ్ చేసుకుంటానని ప్రభాస్ చెప్పడంతో, ఈ తరహా పుకార్లు మళ్లీ మొదలయ్యాయి.

తరలించరు.. కానీ తగ్గిస్తారు!