ఆ విషయంలో బాలయ్య గ్రేట్

సీనియర్ హీరో బాలకృష్ణ వ్యవహార శైలి డిఫరెంట్ గా వుంటుంది. చాలా విషయాల్లో చాలా గ్రౌండెడ్ గా వుంటారు. అది మరోసారి రుజువైంది. తొలిసారి బాలకృష్ణ ఓ వాణిజ్య ప్రకటనలో నటించారు. ఓ రియల్…

సీనియర్ హీరో బాలకృష్ణ వ్యవహార శైలి డిఫరెంట్ గా వుంటుంది. చాలా విషయాల్లో చాలా గ్రౌండెడ్ గా వుంటారు. అది మరోసారి రుజువైంది. తొలిసారి బాలకృష్ణ ఓ వాణిజ్య ప్రకటనలో నటించారు. ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థ రెండు ప్రకటనలను బాలయ్యతో రూపొందించింది. ఇక్కడే మిగిలిన హీరోలకు బాలయ్యకు తేడా తెలిసింది.

సాధారణంగా పెద్ద పెద్ద ప్రకటనలను హీరోలు చేయాల్సి వచ్చినపుడు పెద్దగా కష్టం ఏమీ వుండదు. ఎందుకంటే నేషనల్ లెవెల్ లో యాడ్ ఏజెన్సీలు ఆ యాడ్ ను ముందుగానే డిజైన్ చేసి,కాన్పెస్ట్ అంతా రెడీ చేసి, అరటి పండు వలిచి పెట్టినట్లు తయారు చేస్తాయి. హీరోకి చూపించి, ఓకె అన్న తరువాత ఆ హీరోతో పిక్చరైజ్ చేస్తాయి. దీనికి ఏ క్రియేటర్ అయినా సరిపోతాడు.

కానీ మహేష్ బాబు, బన్నీ ఇలా వీళ్లంతా తమకు ఫలానా డైరక్టర్ నే కావాలంటారు. త్రివిక్రమ్, హరీష్ శంకర్ ఇలా పలువురిని పిలిచి అప్పగిస్తారు. నాగార్జున అయితే కళ్యాణ్ కృష్ణ కు అప్పగిస్తారు. ఆ మధ్య మెగాస్టార్ ఓ యాడ్ ను సుకుమార్ కు అప్పగించారు. ఆ కంపెనీలు తప్పక అందుకు ఒప్పుకుంటాయి. లక్షలకు లక్షలు రెమ్యూనిరేషన్ గా ఆ డైరక్టర్లకు ఇస్తాయి. జస్ట్ కొన్ని గంటల వర్క్ మాత్రమే అది. మెగాస్టార్-సుకుమార్ చేసిన యాడ్ కు డైరక్టర్ ఫీజుగా 50 లక్షలకు పైగానే ఇచ్చినట్లు టాక్ వుంది.

బాలయ్య విషయానికి వస్తే తొలిసారి చేస్తున్న కమర్షియల్ యాడ్. ఎలా వస్తుందో, ఎలా తీస్తారో అన్న అనుమానం వుంటుంది. ఆయనకూ స్వంత మనుషులు వున్నారు. బోయపాటినో, గోపీచంద్ మలినేని నో, అనిల్ రావిపూడినో పిలిచి అప్పగించవచ్చు. కానీ అలా చేయలేదు. మీరు ఎలా, ఎవరి చేత తీయించుకుంటారో మీ ఇష్టం అన్నారు. కాన్సెప్ట్ విన్నారు. చేసేసారు. జస్ట్ రెండు లక్షలు మాత్రమే ఇచ్చారు ఆ కొత్త దర్శకుడికి. యాడ్ వచ్చిన తరువాత ఆ కంపెనీ ఆనందించి 20 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చింది.

ఇలాంటి విషయాల్లో బాలయ్య ను చూస్తే శహభాష్ అనాలనిపిస్తుంది. మరే పెద్ద హీరో అయినా ఓ కొత్త దర్శకుడితో తొలి కమర్షియల్ యాడ్ చేయడం అన్నది సాధ్యపడే విషయం కాదు.