దసరాకు విశాఖకు రాజధాని?

విశాఖ రాజధాని ఎంతెంత దూరం అంటే నాలుగు  నెలలే అని సమాధానం వస్తోంది. అక్టోబర్ 25న విజయదశమి పండుగ ఉంది. అప్పటికి కరోనా మహమ్మారి దూకుడు తగ్గుతుందని భావిస్తున్న ప్రభుత్వం దసరా మంచి రోజును…

విశాఖ రాజధాని ఎంతెంత దూరం అంటే నాలుగు  నెలలే అని సమాధానం వస్తోంది. అక్టోబర్ 25న విజయదశమి పండుగ ఉంది. అప్పటికి కరోనా మహమ్మారి దూకుడు తగ్గుతుందని భావిస్తున్న ప్రభుత్వం దసరా మంచి రోజును విశాఖలో పాలనారాజధానిగా ఏర్పాటు చేయడానికి నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

నిజానికి అసెంబ్లీలో రెండవమారు అధికార వికేంద్రీకరణ బిల్లు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. శాసనమండలిలో దాన్ని పక్కన పెట్టినా జూలై 17 నాటికి నెల పూర్తి అయితే ఆటోమేటిక్ గా అది ఆమోదం పొందినట్లేనని అంటున్నారు. ఆ తరువాత గవర్నర్ కి బిల్లు పంపించి చట్టంగా తీసుకురావాలని రాష్ట్రప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

ఆ తరువాత ఆగస్టు లో ఉన్న మంచి రోజులను మెల్లగా రాజధాని షిఫ్టింగుకు వాడుకుని పూర్తి స్థాయి రాజధానిని అక్టోబర్ నాటికి విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ పెద్దల ఆలోచనగా తెలుస్తోంది.

ఇందుకోసం విశాఖలో భ‌వనాల ఎంపిక కూడా పూర్తి అయింది అంటున్నారు. విశాఖ రాజధాని అయితేనే ఏపీ సర్వతోముఖాభివ్రుధ్ధి సాధ్యమని వైసీపీ సర్కార్ గట్టిగా నమ్ముతోంది. 13 జిల్లాలల్లో ఎతి పెద్ద నగరంగా ఉన్న విశాఖ గ్రోత్ ఇంజన్ గా ఉంటుందని కూడా గట్టిగా నమ్ముతోంది. అంటే ఎట్టిపరిస్థితుల్లోనూ విశాఖే రాజధాని అని వైసీపీ గట్టిగా ఫిక్స్ అయిందని అంటున్నారు.

నాయకుడంటే అర్థం తెలిసింది