ఆస్తి కోసం భర్తనే హత్య చేసింది

మొన్నటికిమొన్న అక్రమ సంబంధం కోసం తూర్పుగోదావరి జిల్లాలో తాళికట్టిన భర్తను హత్యచేసింది ఓ మహిళ. ఇప్పుడు ఆస్తి కోసం విజయవాడలో భర్తను హత్య చేసింది మరో మహిళ. ఇక్కడ కూడా అక్రమ సంబంధం కోణం…

మొన్నటికిమొన్న అక్రమ సంబంధం కోసం తూర్పుగోదావరి జిల్లాలో తాళికట్టిన భర్తను హత్యచేసింది ఓ మహిళ. ఇప్పుడు ఆస్తి కోసం విజయవాడలో భర్తను హత్య చేసింది మరో మహిళ. ఇక్కడ కూడా అక్రమ సంబంధం కోణం వెలుగుచూసింది.

బిహార్ కు చెందిన దినేష్ కుమార్, విజయవాడలో స్థిరపడ్డారు. ఇతడికి భార్య చింతాసింగ్, ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు. ఎప్పుడూ గొడవలే. దీంతో రెండేళ్ల కిందట లీగల్ గా ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.

కోర్డు ఆర్డర్ ప్రకారం దినేష్ ఇంటిపైన చింతాసింగ్ తన కుమారులతో కలిసి ఉంటోంది. కింద పోర్షన్ లో దినేష్ ఉంటున్నాడు. అయితే కొన్ని రోజులుగా దినేష్, తన ఇంటిని ఖాళీ చేయమని చింతాసింగ్ ను డిమాండ్ చేస్తున్నాడు. దీనికి కారణం ఆమెకు రాజ్ కుమార్ అనే మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉండడమే.

కళ్ల ముందే తన మాజీ భార్య మరొకరితో చనువుగా ఉండడం చూసి తట్టుకోలేకపోయిన దినేష్ ఇల్లు ఖాళీ చేయమని డిమాండ్ చేశాడు. అయితే ఇల్లు ఖాళీ చేస్తే తనకు రావాల్సిన ఆస్తి పోతుందని చింతాసింగ్ భయం. ఈ క్రమంలో తన ప్రియుడు రాజ్ కుమార్ తో కలిసి దినేష్ ను హత్య చేసింది చింతాసింగ్.

హత్య తర్వాత పరారైన చింతాసింగ్, రాజ్ కుమార్ ను నిన్న పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.

నాయకుడంటే అర్థం తెలిసింది