పిల్లల విషయంలోనే పవన్ టెన్షన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడ? అటు రాజకీయాల్లోనూ ఆయన జాడ లేదు. ఇటు సినిమాల విషయంలోనో ఆయన సంగతి తెలియడం లేదు. 60శాతానికి పైగా పూర్తయిన వకీల్ సాబ్ సినిమా అలా వుండిపోయింది.…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడ? అటు రాజకీయాల్లోనూ ఆయన జాడ లేదు. ఇటు సినిమాల విషయంలోనో ఆయన సంగతి తెలియడం లేదు. 60శాతానికి పైగా పూర్తయిన వకీల్ సాబ్ సినిమా అలా వుండిపోయింది. ట్విట్టర్ లో ప్రకటనలు ఇవ్వడం మినహా ఆంధ్రలో అడుగు పెట్టకుండా పవన్ హైదరాబాద్ లోని ఇంటికే పరిమితం అయిపోయారు. ఆంధ్రలో ఏ హడావుడి జరిగినా పవన్ కాలు కదపడం లేదు. అసలు పవన్ బయట కనిపించి నెలలు దాటుంతోంది.

వయసు మీద పడిన చంద్రబాబు కూడా ఆంధ్ర వెళ్లి వుండి వచ్చారు. కానీ యాభై ఏళ్ల పవన్ మాత్రం ఇంటికే పరిమితం అయ్యారు. పవన్ వైఖరిపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు చూస్తూ, ఆయన ఫ్యాన్స్ కక్కలేక, మింగలేక మౌనంగా వున్నారు. భాజపాకు దగ్గర కావడంతోనే జనసేన పార్టీ క్యాడర్ సగం నీరుకారిపోయింది. ఇప్పుడు కరోనా నేపథ్యంలో పవన్ వైఖరితో పూర్తిగా నీరుకారిపోయింది. పవన్ కన్నా మెగాస్టార్ చిరంజీవి నే బెటర్ అనిపించుకుంటున్నారు. అటు సిసిసి అంటూ, ఇటు ఇండస్ట్రీ సమస్యలు అంటూ ఫుల్ యాక్టివ్ అయ్యారు. 

అయితే పవన్ ఇంతలా ఇంటికే పరిమితం కావడానికి కారణం ఆయనకు ఇద్దరు చిన్న పిల్లలు ఇంట్లొ వుండడమే అని వినిపిస్తోంది. తనకు భయం లేదని, కానీ బయట తిరిగి ఇంటికి వస్తే, ఇంట్లో ఇద్దరు పిల్లలు వున్నారని, వారి క్షేమం కూడా తనకు ముఖ్యమని పవన్ తన సన్నిహితుల దగ్గర చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఇప్పట్లో వకీల్ సాబ్ షూట్ ప్రారంభం కాదని తెలుస్తోంది. 

నిర్మాత దిల్ రాజు కూడా తొందర పడడం లేదు.  జనవరి సీజన్ కు మరే సినిమా వచ్చే సూచనలు అస్సలు లేవు. పైగా అబౌవ్ మీడియం సినిమాలు ఒకటి రెండు వున్నా, గిల్డ్ అంతా ఆయన కంట్రోల్ లోనే వుంది కనుక, మరే సినిమాను దగ్గరగా రానిచ్చే అవకాశం లేదు. అందుకే అక్టోబర్ కు మొదలుపెట్టినా సంక్రాంతికి రెడీ చేసేయవచ్చు అన్న ధీమాగా వున్నారు. దాంతో పవన్ కు కూడా వీలు దొరికింది కాబట్టి, ఇంట్లోనే ఎవ్వరితో టచ్లో లేకుండా వుంటున్నట్లు తెలుస్తోంది.

మళ్ళీ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ ?

నిమ్మగడ్డ వ్యవహారంపై పూర్తి దర్యాప్తు