సీటీమార్ కు మెగా సపోర్ట్

సినిమా ఇండస్ట్రీ క్లిష్ట పరిస్థితుల్లో వుంది. కరోనా రెండో దశ తరువాత జనాలు థియేటర్లకు సరిగ్గా రావడం లేదు. సరైన మాస్ సినిమా పడితే మళ్లీ థియేటర్లు కళకళలాడతాయి అన్న నమ్మకం వుంది. కానీ…

సినిమా ఇండస్ట్రీ క్లిష్ట పరిస్థితుల్లో వుంది. కరోనా రెండో దశ తరువాత జనాలు థియేటర్లకు సరిగ్గా రావడం లేదు. సరైన మాస్ సినిమా పడితే మళ్లీ థియేటర్లు కళకళలాడతాయి అన్న నమ్మకం వుంది. కానీ ఆ నమ్మకం నిజం అవుతుందో కాదో తెలియదు. 

సరైన పాజిటివ్ రివ్యూలు వచ్చినా జనం రావడం లేదు. అలా కాకున్నా రావడం లేదు. ఇలాంటి టైమ్ లో సీటీమార్ అన్నది టెస్టింగ్ టూల్ గా తయారయింది.

అందుకే సీటీమార్ ను కనుక నిలబెట్టగలిగితే, దానికి మంచి ఓపెనింగ్ లు, కలెక్షన్లు రప్పించగలిగితే టాలీవుడ్ నిర్మాతలు ధైర్యం చేస్తారు. మరిన్ని సినిమాలు విడుదలకు ముందుకు వస్తాయి. ఇదే ఆలోచనతో మెగాస్టార్ చిరంజీవి కూడా ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

సీటీమార్ కు మద్దతుగా ఓ వీడీయో బైట్ ను ఆయన ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ బైట్ ను సీటీమార్ అడియో ఫంక్షన్ లో విడుదల చేసే అవకాశం వుంది. 

మెగాస్టార్ మాదిరిగా సినిమా పెద్దలు ముందుకు వచ్చి, ఇలా చేస్తే జనం థియేటర్ కు వస్తారేమో? ఆపై సినిమా అదృష్టం.