పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి పోటీలు పడి మరీ సినిమాలు ఓకె చేసి, చేస్తున్నట్లు కనిపిస్తోంది. చిరు చేతిలో నాలుగు సినిమాలు వున్నాయి. మరో రెండు సినిమాల కథ మీద కసరత్తు జరుగుతోంది.
పవర్ స్టార్ చేతిలో నాలుగు సినిమాలు వున్నాయి. ఇవన్నీ ఇలా వుండగానే పవర్ స్టార్ మరో సబ్జెక్ట్ కోసం ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది.
భీమ్లా నాయక్ సినిమా పూర్తి కాగానే క్రిష్ సినిమాను ఫినిష్ చేస్తారు. ఆ తరువాత లెక్క ప్రకారం హరీష్ శంకర్ సినిమా స్టార్ట్ చేయాలి. కానీ దానికి మూడు నెలలు గ్యాప్ ఇచ్చి, ఈ లోగా మరో సినిమా చేసే ఆలోచనలు సాగుతున్నాయని విశ్వసనీయ వర్గాల బోగట్టా. అయితే అలా మూడు నెలల్లో ఫినిష్ చేయగల కథ, ప్రాజెక్టు కావాలి.
వకీల్ సాబ్, భీమ్లా నాయక్ ల మాదిరిగా అది రీమేక్ అయినా ఓకె అని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు కొత్త నిర్మాతను చూస్తారా? లేక దానిని నిర్మాత రామ్ తాళ్లూరికి అప్పగిస్తారా? అన్నది తెలియదు.
రామ్ తాళ్లూరి ప్రాజెక్టును త్వరగా ఫినిష్ చేయాలని పవన్ భావిస్తున్నట్లు బోగట్టా. వాస్తవానికి ఆ ప్రాజెక్టుకు సురేందర్ రెడ్డి డైరక్టర్. అయితే ఆయన బిజీగా వున్నారు.
మరి సరైన రీమేక్ దొరికితే వేరే డైరక్టర్ తో రామ్ తాళ్లూరికి చేస్తారా? లేదా కొత్త ప్రొడ్యూసర్ కు చేస్తారా? అన్నది తెలియాల్సి వుంది.