టెక్కలి లెక్కలు తేలిపోతాయట

టెక్కలి అంటే ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సీటు. ఆయన  జగన్ వేవ్ లో కూడా గెలిచి పట్టు నిలుపుకున్నారు. అటువంటి టెక్కలి సీట్లో 2024 ఎన్నికల్లో పాగా వేయాలని వైసీపీ పట్టుదలగా…

టెక్కలి అంటే ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సీటు. ఆయన  జగన్ వేవ్ లో కూడా గెలిచి పట్టు నిలుపుకున్నారు. అటువంటి టెక్కలి సీట్లో 2024 ఎన్నికల్లో పాగా వేయాలని వైసీపీ పట్టుదలగా ఉంది. అచ్చెన్నను ఈసారి అసెంబ్లీకి రానీయకుండా చేయిస్తే ఉత్తరాంధ్రా జిల్లాలలో తమ విజయం పరిపూర్ణం అవుతుంది అని వైసీపీ హై కమాండ్ భావిస్తోంది.

అందుకోసం ప్రత్యేకంగా టెక్కలి వైసీపీ నేతలతో జగన్ మీటింగ్ ఏర్పాటు చేశారు. జగన్ 175 సీట్ల లక్ష్యానికి అనుగుణంగా టీడీపీ గెలిచిన సీట్ల మీదనే దృష్టి పెట్టారని అంటున్నారు. కుప్పంలో చంద్రబాబునే ఓడిస్తామని ధైర్యంగా చెబుతున్న వైసీపీకి టెక్కలి నిజంగా లెక్క కాదు. అందుకే ఇక్కడ ఈసారి ఎందుకు వైసీపీ గెలవకూడదు అని జగన్ టెక్కలి నేతలను ప్రశ్నిస్తున్నారు.

టెక్కలి వైసీపీలో సీనియర్ నేతలు బలమైన నాయకులు చాలా మంది ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి టెక్కలికి చెందిన వారే. ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి వైసీపీ ఇంచార్జిగా ఉంటున్నారు. ఏపీ కాళింగ కార్పోరేషన్ చైర్మన్ పేడాడ తిలక్ 2019 ఎన్నికల్లో పోటీ చేసి అచ్చెన్నాయుడుకు గట్టి పోటీ ఇస్తే ఏడెనిమిది వేల ఓట్ల అచ్చెన్న తేడాతో గెలిచారు.

ఇలా ముగ్గురు నాయకులూ బలవంతులే. దీంతో వీరిని కో ఆర్డినేట్ చేసుకుని అచ్చెన్న మీదకు గట్తిగా ప్రయోగిస్తే కచ్చితంగా అచ్చెన్నాయుడు మాజీ ఎమ్మెల్యే అవుతారు అని వైసీపీ లెక్కలు వేస్తోంది. టెక్కలిలో బలమైన కాళింగ వర్గానికే ఈసారి ఎమ్మెల్యే సీటు దక్కాలన్న సెంటిమెంట్ ని ఎమోషన్ని పండించి అయినా గెలవాలని వైసీపీ నేతలు చూస్తున్నారని టాక్.

వారికి హై కమాండ్ గెలుపు కోసం దిశానిర్దేశం చేస్తోంది. టెక్కలి లో అచ్చెన్న ఓడితే ఆ కిక్కే వేరు. లాస్ట్ పంచ్ తమదే అవుతుందని వైసీపీ భావిస్తోంది. టెక్కలి వైసీపీ లెక్క కుదిరితే మాత్రం అచ్చెన్న ఏపీ అంతా తిరగకుండా టెక్కలిలోనే ఉండి పోరాడాల్సి వస్తుందని వైసీపీ నేతలు అంటున్నారు. దువ్వాడ శ్రీనివాస్ అచ్చెన్న మీద పోటీ చేసే వైసీపీ అభ్యర్ధి అని కూడా ఫిక్స్ చేస్తున్నారు. వచ్ఛే ఎన్నికల్లో టెక్కలి రాజకీయ సమరం మజాయే అంటున్నారు.