సరోగసి విషయంలో నటి నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతులకు పెద్ద ఊరట లభించింది. పెళ్లైన నాలుగు నెలలకే సరోగసి ద్వారా ఇద్దరు కవలలు జన్మనిచ్చారన్న వివాదం రావడంతో తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విచారణ జరిపి నయనతార దంపతులకు క్లీన్ చీట్ ఇచ్చాయి.
నయనతార, విఘ్నేస్ దంపతులు సరోగసీ 2021 యాక్ట్ ప్రకారమే కవల పిల్లల్ని పొందినట్లు తమిళనాడు హెల్త్ మినిస్టరీ ఈరోజు అధికారికంగా ప్రకటించింది. నయనతార, విఘ్నేశ్ లు 2016 మార్చిలోనే వివాహం చేసుకున్నట్లు మ్యారేజ్ సర్టిఫికెట్ ని కమిటీకి సమర్పించారు. అలాగే చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారమే సరోగసి ద్వారా కవలలు జన్మించినట్లు ఆధారాల్ని కమిటీకి ఇవ్వడంతో ప్రభుత్వ అధికారుల కమిటీ వారికి క్లీన్ చీట్ ఇచ్చారు.
మొత్తానికి నయనతార, విఘ్నేశ్ శివన్ల సరోగసి వ్యవహారానికి ఒక ఫుల్ స్టాప్ పడినట్ల లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది. పిల్లలకు జన్మనిచ్చిన అద్దె తల్లి నయనతార బంధువు అని, ఆమె దుబాయ్లో ఉన్నారని తమిళనాడు ఆరోగ్య శాఖకు ఇచ్చిన నివేదికలో ఈ జంట పేర్కొన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.