కన్నా.. ఎల్లో మీడియాకు హీరో

తెలుగుదేశం అను'కుల' మీడియాకు ఓ అలవాటు వుంది. జగన్ ను ఎవరు తిడితే, వాడు గొప్పోడు. ఆ వార్త ఫస్ట్ ఫేజీ వార్త. అలా తిట్టినవాడు వార్డు మెంబరు అయినా, కార్పొరేటర్ అయినా, చోటా…

తెలుగుదేశం అను'కుల' మీడియాకు ఓ అలవాటు వుంది. జగన్ ను ఎవరు తిడితే, వాడు గొప్పోడు. ఆ వార్త ఫస్ట్ ఫేజీ వార్త. అలా తిట్టినవాడు వార్డు మెంబరు అయినా, కార్పొరేటర్ అయినా, చోటా నాయకుడు అయినా, బడా నాయకుడు అయినా సరే. కొన్నినెలల క్రితం వరకు భాజపా నాయకులు ఈ అను'కుల' మీడియాకు కనిపించలేదు. ఎందుకంటే వాళ్లు అప్పుడు తేదేపాను విమర్శించేవారు. అందుకని వాళ్ల వార్తలు పక్కన పెట్టడం అన్నది ఎజెండా అయింది. అయితే ఇప్పుడు అవే వార్తలు, అదే జనాలు ఈ అను'కుల' మీడియాకు తెగ ముద్దువచ్చేస్తున్నారు.

భాజపా వార్తలు అన్నీ ఫ్రంట్ పేజీని అలంకరించేస్తున్నాయి. తమ విమర్శలకు ఇంత ప్రాధాన్యత వస్తోందని, ఆ పార్టీ నేతలు మరింత రెచ్చిపోతున్నారు. వాస్తవానికి భాజపా నాయకులను ఇప్పుడు రెండు రకాలుగా విడదీయాలేమో? ఎన్నికల ముందు కూడా భాజపాలోనే వున్నవారు. ఎన్నికల ఫలితం తరువాత భాజపాలోకి జంప్ జిలానీ అన్నవారు. ఈ జంప్ జిలానీల్లో కూడా కమ్మ సామాజిక వర్గనేతలే ఎక్కువ. ఇప్పుడు గడబిడ చేస్తున్నవారిలో కూడా అగ్రస్థానం కూడా వారిదే.

నిన్న మొన్న భాజపాలో చేరి, వారే అధికార ప్రతినిధులు, వారే పార్టీ స్పోక్స్ పర్సన్స్ అన్నంత రీతిలో స్టేట్ మెంట్ లు పడేస్తున్నారు. భర్తను, కొడుకును వైకాపాలోకి పంపి, తాను భాజపాలో వున్న చిన్నమ్మ పురంధ్రీశ్వరి కూడా వైకాపా మీద విరుచుకుపడుతున్నారు. అదృష్టం బాగాలేక కానీ, ఆమె కుటుంబ సభ్యులు మొన్న ఎన్నికల్లో గెలిచివుంటే మంత్రిపదవి ఆశించేవారే. దొరకబుచ్చుకునేవారే. అప్పుడు చిన్నమ్మ గప్ చుప్ గా వుండి వుండేవారేమో?

మొత్తంమీద తేదేపా నాయకులు అంతా సైలంట్ అవుతున్నారు. వారి ప్లేస్ లో తేదేపా నుంచి మారిన భాజపా నాయకులు రంగంలోకి దిగారు. ఎవరైతేనేం, జగన్ ను తిడుతున్నారా లేదా? అదే మనకు కావాల్సింది అన్నట్లు ఫ్రంట్ పేజీ నింపుతున్నాయి 'దేశం' అను'కుల' మీడియా పత్రికలు.

ఏపీ రాజధానిని వైఎస్ జగన్ మారుస్తారా?