కరోనిల్.. పతంజలి నుంచి కరోనాకు మందు

రోగ నిరోధక శక్తిని పెంచడమే కాదు, ఏకంగా కరోనాను తగ్గించే మందును కనిబెట్టినట్టు ప్రకటించుకుంది పతంజలి ఆయుర్వేద సంస్థ. కొద్దిసేపటి కిందట హరిద్వార్ లోని పతంజలి యోగపీఠ్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో కరోనాకు కరోనిల్…

రోగ నిరోధక శక్తిని పెంచడమే కాదు, ఏకంగా కరోనాను తగ్గించే మందును కనిబెట్టినట్టు ప్రకటించుకుంది పతంజలి ఆయుర్వేద సంస్థ. కొద్దిసేపటి కిందట హరిద్వార్ లోని పతంజలి యోగపీఠ్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో కరోనాకు కరోనిల్ మరియు శ్వాశరి మందుల్ని తయారుచేసినట్టు ప్రకటించింది. కరోనాను తగ్గించేందుకు వచ్చిన మొట్టమొదటి ఆయుర్వేదిక్ మందు ఇదేనంటోంది పతంజలి.

ఓవైపు యావత్ ప్రపంచం కరోనాకు వాక్సిన్, మందును కనుగొనేందుకు కిందామీద పడుతుంటే.. పతంజలి సంస్థ మాత్రం మరో వారం రోజుల్లో మందును విపణిలోకి అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ మేరకు క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించి వివరాల్ని కూడా సమావేశంలో వెల్లడించారు.

క్లినికల్ ట్రయల్స్ లో తమ మందుకు వందశాతం సత్ఫలితాలు వచ్చాయని చెప్పుకుంది పతంజలి. జైపూర్ కు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ తో కలిసి పతంజలి ఆయుర్వేదిక్ లిమిటెడ్ ఈ మందును తయారుచేసిందని ప్రకటించిన సంస్థ… తమ మందు వాడితే 3 రోజుల నుంచి వారం రోజుల్లోగా కరోనా తగ్గిపోతుందని చెబుతోంది.

ఢిల్లీ, అహ్మదాబాద్ లాంటి పలు నగరాల్లో 280 మంది కరోనా రోగులపై ఈ మందును పరీక్షించామని చెబుతోంది పతంజలి. వాళ్లంతా కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని అంటోంది. అన్ని రకాల క్రినికల్ కంట్రోల్ ట్రయిల్స్ పూర్తిచేశామని వచ్చే వారం నుంచి కరోనిల్ కిట్ అందుబాటులోకి వస్తుందని తెలిపిన సంస్థ.. ఈ మేరకు ఓ యాప్ ను కూడా విడుదల చేయబోతున్నట్టు తెలిపింది.

ప్రస్తుతం కరోనా ట్రీట్ మెంట్ కు లక్షల్లో ఖర్చు అవుతోంది. ప్రైవేట్ హాస్పిటల్స్ లో 15 లక్షల రూపాయల బిల్ అవుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే తమ కరోనిల్ కిట్ కేవలం 545 రూపాయలు మాత్రమే అంటోంది పతంజలి.

కల్నల్ భార్యకు డిప్యూటీ కలెక్టర్ హోదా

అమరావతినే కొనసాగిస్తారా ?