ఆ సినిమా కూడా ప్రకటించిన పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా చాలా హంగామా నడుస్తోంది. భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. పవన్-హరీశ్ శంకర్ సినిమా ప్రీ-లుక్ ఉండనే ఉంది.…

పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా చాలా హంగామా నడుస్తోంది. భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. పవన్-హరీశ్ శంకర్ సినిమా ప్రీ-లుక్ ఉండనే ఉంది. అయితే ఇవన్నీ అంతా ఊహించినవే. ఏదో ఒక సందడి ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేసినవే. కానీ ఊహించని ప్రకటన ఇంకోటి వచ్చింది. అదే సురేందర్ రెడ్డితో సినిమా.

పవన్ కల్యాణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో సినిమాపై ఊహాగానాలు చాలా రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు ఈ ప్రాజెక్టును కూడా ప్రకటించాడు పవన్. ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కల్యాణ్ చేయబోయే సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కొద్దిసేపటి కిందట వచ్చేసింది.

హైదరాబాద్ బ్యాక్ డ్రైప్ లో, గన్ కల్చర్ తో ఈ సినిమా రాబోతోందనే విషయాన్ని ప్రీ-లుక్ పోస్టర్ ద్వారా వివరించారు. ఈ సినిమాకు వక్కంతం వంశీ కథ అందించాడు. యథా కాలమ్.. తథా వ్యవహారమ్ అనే క్యాప్షన్ ను తగిలించారు. ప్రస్తుతానికి ఈ సినిమా డీటెయిల్స్ ఇవే.

మొత్తానికి పవన్ నుంచి మరో సినిమా ప్రకటన వచ్చేసింది. రీఎంట్రీ తర్వాత వకీల్ సాబ్ సినిమాను ఆల్రెడీ రిలీజ్ చేసిన పవన్.. క్రిష్, సాగర్ చంద్ర, హరీష్ శంకర్ సినిమాల్ని లైన్లో పెట్టాడు. ఇప్పుడు వీటికి అదనంగా సురేందర్ రెడ్డి ప్రాజెక్టు వచ్చి చేరింది.