ఫర్నీచర్ దొంగతనం.. అధికారిపై వేటు, కోడెలపై?

ఏపీ అసెంబ్లీని హైదరాబాద్ నుంచి తరలించే క్రమంలో ఫర్నీచర్ ను అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇంటికి తరిలించిన వివాదంలో చీఫ్ మార్షల్ పై వేటుపడింది. అసెంబ్లీలోని విలువైన ఫర్నీచర్ ను తన సొంత…

ఏపీ అసెంబ్లీని హైదరాబాద్ నుంచి తరలించే క్రమంలో ఫర్నీచర్ ను అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇంటికి తరిలించిన వివాదంలో చీఫ్ మార్షల్ పై వేటుపడింది. అసెంబ్లీలోని విలువైన ఫర్నీచర్ ను తన సొంత ప్రాపర్టీ కింద జమ కట్టుకున్నారు కోడెల. ఆయన కక్కర్తిలో అదో భీకరమైన అధ్యాయం అని పరిశీలకులు అంటున్నారు.

అప్పటికే కోడెల కుటుంబీకుల బెదిరింపులు, వసూళ్లపై రకరకాల ఆరోపణలున్నాయి. అవి చాలవన్నట్టుగా అసెంబ్లీలో ఫర్నీచర్ ను కూడా అలా తరలించుకుపోయినట్టుగా ఉన్నారు. తీరా ఇప్పుడు కావాలంటే ఆ ఫర్నీచర్ ను వెనక్కు ఇచ్చేస్తానంటూ కోడెల లేఖ రాశారట! ఎవరినైనా పంపితే వాటిని తిరిగి పంపిస్తారట!

అప్పుడేమో చీఫ్ మార్షల్ ద్వారా, అసెంబ్లీలో సీసీ కెమెరాలను ఆఫ్ చేయించి మరీ తీసుకెళ్లారట. ఇప్పుడు ఎవరినైనా పంపిస్తే వెనక్కు పంపుతారట. కోడెల కక్కుర్తితో చీఫ్ మార్షల్ పై వేటుపడింది. ఆయనపై ఏపీ డీజీపీ చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ ఆస్తి దొంగతనంలో సహకరించినందుకు ఆయనపై ఆ వేటుపడింది.

అయితే తను కోడెల ఆదేశాల మేరకే ఆ ఫర్నీచర్ ను తరలించినట్టుగా ఆయన చెప్పారట. కానీ చర్యలు అయితే తప్పలేదు. మరి అధికారిపై వేటుపడింది సరే.. ఇంతకీ కోడెల మీద చర్యలు ఏమిటి? అనేది ప్రజలే డిసైడ్ చేశారు. అసెంబ్లీ నుంచి ఫర్నీచర్ తరలించుకున్న వైనం బయటపడక ముందే వారు ఆయనకు మళ్లీ అసెంబ్లీలోకి వెళ్లనీయకుండా చేశారు. తద్వారా కోడెలపై చర్యలను ప్రజలు పూర్తిచేశారు. కానీ తెలుగుదేశమే ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదనే చర్చ జరుగుతోంది ప్రజల్లో.

ముడుపులకు ఆశపడితే మూడినట్టే!