Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బన్నీ ప్రాజెక్టుతో సాయితేజ్

బన్నీ ప్రాజెక్టుతో సాయితేజ్

పెద్ద హీరోలు కొత్త డైరక్టర్లతో సినిమా చేద్దాం అనుకున్నా, అది అంత సులువుగా సాధ్యంకాదు. స్టయిలిష్ స్టార్ బన్నీ కూడా ఆ మధ్య ఇలాగే ఓ సినిమాను కొత్త డైరక్టర్ తో చేయాలనుకున్నాడు. ఇదంతా త్రివిక్రమ్ సినిమా ఓకె చేయకముందు సంగతి. అప్పట్లో ఈ విషయమై వార్తలు కూడా వచ్చాయి. కానీ అంతలో త్రివిక్రమ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. బన్నీ-త్రివిక్రమ్ సినిమా ఫైనల్ అయింది.

కట్ చేస్తే, ఆ కొత్త డైరక్టర్ తన స్క్రిప్ట్ తో మెగా కాంపౌండ్ నుంచి బయటకు వచ్చాడు. స్క్రిప్ట్ బాగుంది కదా అని (బాగుంది కనుకే బన్నీ లాంటి స్టార్ హీరో చేయాలనుకున్నాడు) నిర్మాత భోగవిల్లి ప్రసాద్ దగ్గరకు తీసారు. హీరో సాయిధరమ్ తేజ్ తో ఆ ప్రాజెక్టు ఫైనల్ అయింది. ఆ డైరక్టర్ పేరే సుబ్బు. ఇతగాడు గతంలో విరించి వర్మ తదితరుల దగ్గర పనిచేసారు.

అంతేకాదు, అఖిల్-బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమాకు డైలాగ్ వెర్షన్ ఇతగాడిదే అని కూడా తెలుస్తోంది. నభానటేష్-సాయితేజ్ కాంబినేషన్ లో నవంబర్ తరువాత నుంచి ఈ సినిమా వర్క్ స్టార్ట్ అవుతుంది.

ముడుపులకు ఆశపడితే మూడినట్టే!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?