ఓవర్ సీస్ మార్కెట్ లోకి మారుతి

డైరక్టర్ మారుతి ఆరంభంలో డిస్ట్రిబ్యూటర్, నిర్మాత. ఆ తరువాతనే డైరక్టర్ గా మారారు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు స్నేహితులతో కలిసి సినిమాల డిస్ట్రిబ్యూషన్ మీద పెట్టుబడి పెడుతుంటారు. గతంలో ఆయన తన సినిమాలు కొన్నింటిని…

డైరక్టర్ మారుతి ఆరంభంలో డిస్ట్రిబ్యూటర్, నిర్మాత. ఆ తరువాతనే డైరక్టర్ గా మారారు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు స్నేహితులతో కలిసి సినిమాల డిస్ట్రిబ్యూషన్ మీద పెట్టుబడి పెడుతుంటారు. గతంలో ఆయన తన సినిమాలు కొన్నింటిని ఓవర్ సీస్ మార్కెట్ లో తన భాగస్తులతోనే కొని విడుదల చేసి లాభాలు చేసుకున్నారు.

లేటెస్ట్ గా సాయిధరమ్ తేజ్ తో డైరక్ట్ చేస్తున్న ప్రతిరోజూ పండుగే సినిమాను ఓవర్ సీస్ మార్కెట్ రైట్స్ ను తానే కొనుక్కున్నట్లు తెలుస్తోంది. రెండో కోట్ల పాతిక లక్షలకు మారుతి ఆ సినిమా ఓవర్ సీస్ రైట్స్ తీసుకుని, తన ఓవర్ సీస్ భాగస్వాముల దగ్గర పెట్టినట్లు తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం ఓవర్ సీస్ మార్కెట్ అంతా బాగాలేదు. రెండుకోట్ల పాతికలక్షలు అంటే చిన్న మొత్తం కాదు. మాంచి ఫీల్ గుడ్ సినిమా. ఫన్ ఎంటర్ టైనర్ అని పేరు తెచ్చుకుంటేనే ఓవర్ సీస్ మార్కెట్ లో గట్టెక్కడానికి చాన్స్ వుంటుంది. గతంలో కొన్ని మారుతి సినిమాలు ఓవర్ సీస్ మార్కెట్ లో బాగానే వసూళ్లు చేసాయి. ఆ దైర్యంతోనే ఈ సినిమా బిజినెస్ లోకి ఎంటర్ అయి వుండొచ్చు.