Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బన్నీ సరసన దిశాపటానీ

బన్నీ సరసన దిశాపటానీ

ఒక్కోసారి రచ్చ గెలవడానికి ట్రయ్ చేసినా కుదరదు. ఇంట గెలిచాక రచ్చగెలిచే అవకాశం వస్తుంది. లోఫర్ అనే సినిమాతో పూరి జగన్నాధ్ డిస్కవరీగా తెలుగు జనాలకు దిశాపటాని పరిచయం. వరుణ్ తేజ్ సరసన నటించిన ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తరువాత బాలీవుడ్ లో మాంచి సినిమాలు చేసి పేరు తెచ్చుకుంది దిశాపటాని. ఇప్పడు బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ అయింది.

అందుకే తెలుగునాట అవకాశం వెదక్కుంటూ వచ్చింది. బన్నీ హీరోగా దిల్ రాజు నిర్మించే ఐకాన్ సినిమాకు దిశాపటానిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇదంతా చిత్రంగా జరిగింది. ఆలియా భట్ లెవెల్ హీరోయిన్ కోసం బన్నీ అండ్ దిల్ రాజు చూస్తున్నారు. అదే సమయంలో అఖిల్ -బొమ్మరిల్లు భాస్కర్ సినిమా కోసం దిశాపటానీ వైపు వెళ్లింది గీతాసంస్థ దృష్టి.

కానీ అఖిల్ అంటే దిశ కాస్త ముందు వెనుకలు ఆలోచించినట్లు తెలుస్తోంది. పైగా నాలుగు కోట్ల వరకు రెమ్యూనిరేషన్. దాంతో ఆ ఆలోచన ఇటు మార్చి, బన్నీకి దిశాపటానిని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?