Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆర్జీవీ సినిమాలో 'పవర్ స్టార్'

ఆర్జీవీ సినిమాలో 'పవర్ స్టార్'

రామ్ గోపాల్ వర్మ ఖాళీగా వుండలేరు. జనాలను కెలక్కుండా అసలు వుండలేరు. ఒక పక్క మెగాస్టార్ బర్త్ డే అంటూ మెగాభిమానులు అంతా ఊగిపోతూ వుంటే, ఆర్జీవీ ఓ సంచలన ట్వీట్ వేసాడు. తను తీస్తున్న కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ వుందంటూ అన్యాపదేశంగా ఓ ట్వీట్ వేసాడు. 

ఇది చాలదా ఇక ట్విట్టర్ లో అర్జీవీ ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్, పవన్ యాంటీ ఫ్యాన్స్ తిట్టేసుకోవడానికి. అదే జరుగుతోంది ఇప్పుడు ట్విట్టర్ లో. కమ్మరాజ్యంలో కడప రెడ్లు అంటూ, అమరావతి లో జగన్ ప్రభుత్వం ఏర్పాటుకావడాన్ని ఇండైరెక్ట్ గా చెబుతూ సిన్మా ప్లాన్ చేసారు ఆర్జీవీ. ఇటీవలే ఓ సాంగ్ కూడా విడుదల చేసారు.

ఏదో ఒక పాయింట్ తో చిన్న కథ అల్లేసి, కాసిన్ని సంచలమైన సీన్లు జోడించేసి, సినిమా తయారు చేసి వదిలేయడం ఆర్జీవీ స్టయిల్. జనం సినిమా విడుదలకు ముందు ఎక్కువ, విడదలయ్యాక తక్కువ మాట్లాడుకోవడం కూడా కామన్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?