టాలీవుడ్ లక్కీ హీరోయిన్ ఎవరంటే రష్మికనే. ఆల్ మోస్ట్ అన్ని సినిమాలు సక్సెస్ నే. ఒక్కటో రెండో తప్ప. అందుకే ఆమెకు అంత డిమాండ్ కూడా వుంది. అలాంటి రష్మిక ఇప్పుడు తన రెమ్యూనిరేషన్ గా కోటీ ఇరవై లక్షల వరకు తీసుకుంటోందని టాక్. అంత రెమ్యూనిరేషన్ తీసుకున్నా కూడా ప్రాజెక్టుల విషయంలో చాలా అంటే చాలా ఛూజీగా వుంటోందట.
ముఖ్యంగా తన ఏజ్ గ్రూప్ హీరోయిన్లు నటించే సినిమాల్లో తనకు కూడా మంచి పాత్ర వచ్చినా చేయదు కాక చేయదట. సోలో హీరోయిన్ క్యారెక్టర్ అయితేనే ఒకె అంటుందట. నాని హీరోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ చేయబోయే 'శ్యామ్ సింఘ రాయ్' సినిమాలో ముగ్గురు హీరోయిన్లు. ఒకమ్మాయి మెయిన్ హీరోయిన్. ఈ క్యారెక్టర్ కు సాయి పల్లవి ఫిక్స్ అయిపోయింది దాదాపుగా. హీరో పాస్ట్ లో ఓ లవ్ స్టోరీ, దానికో హీరోయిన్ కావాలి. అలాగే ఓ కీలక పాత్రకు మరో హీరోయిన్ కావాలి.
ఈ లవ్ స్టోరీ పాత్రకు రష్మికను తీసుకోవాలని నిర్మాతలకు వున్నా, సాయిపల్లవి వుండడం, అలాగే మరో పాత్రకు ఇంకో హీరోయిన్ ను తీసుకోవాల్సి వుండడంతో, రష్మిక చేయడం కష్టం అని తెలుస్తోంది. రెమ్యూనిరేషన్ సమస్య లేదు. ఎందుకంటే సితార బ్యానర్ కాబట్టి, అవసరం అయితే రెమ్యూనిరేషన్ దగ్గర బేరాలు ఆడరు. కానీ అసలు బేసిక్ గా మల్టీ హీరోయిన్ల సినిమాలో రష్మిక చేయదన్నదే సమస్య.
అందుకే మలయాళ హీరోయిన్ ను ట్రయ్ చేస్తున్నట్లు బోగట్టా. మాళవిక మోహనన్ ను అలాగే శోభు దూళిపాల లాంటి డిఫరెంట్ ఫేస్ ను రెండు క్యారెక్టర్లకు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అవును ఇంతకీ రాశీఖన్నా ఎందుకు డైరక్టర్ దృష్టిలో పడడం లేదో? డైరక్టర్ కు అంతగా ఇష్టం లేదని టాక్.