సుధీర్ తో తనకున్న అనుబంధంపై మరోసారి రియాక్ట్ అయింది హాట్ యాంకర్ రష్మి. తామిద్దరం ఆన్ స్క్రీన్ పై మాత్రమే రెచ్చిపోతామని, అదంతా షో అని అంటోంది. అంతకుమించి సుధీర్ కు తనకు ఎలాంటి ఎఫైర్ లేదంటోంది.
“నేను, సుధీర్ కలిసి చేసే పనులు.. మా కెమిస్ట్రీ జనాల్లోకి బాగా వెళ్లింది. ఇది పాజిటివ్ సైన్. మేం మంచి నటులమని ప్రూవ్ అయింది. అయినప్పటికీ జనాలు మా ఇద్దరిపై ఏవేవో అంచనాలు పెట్టుకున్నారు. వాళ్లకు నేను చెప్పేది ఒకటే. ఇదంతా షో. మా పని మేం చేశామంతే, జనాలకు అది ఎక్కేసిందంటే గర్వంగా ఉంది.”
సుడిగాలి సుధీర్ తో తనకున్న బంధం అంత వరకేనని మరోసారి చెప్పుకొచ్చింది రష్మి. ఈ లాక్ డౌన్ 2 నెలల కాలంలో కనీసం సుధీర్ తో మాట్లాడాలని కూడా తనకు అనిపించలేదని అంటున్న రష్మీ.. జనతా కర్ఫ్యూ తర్వాత ఒకేఒక్క సారి అతడితో మాట్లాడానంటోంది.
లాక్ డౌన్ కారణంగా 2 నెలలకు పైగా తీసుకున్న లాంగ్ గ్యాప్ తర్వాత మరోసారి కెమెరా ముందుకొచ్చింది రష్మి. త్వరలోనే ఎక్స్ ట్రా జబర్దస్త్ తో ప్రేక్షకుల్ని పలకరించబోతోంది.