Advertisement

Advertisement


Home > Movies - Movie News

మా నాన్న నన్ను ప్రోత్సహించలేదు

మా నాన్న నన్ను ప్రోత్సహించలేదు

టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే మరోసారి నెపొజిటం/బంధుప్రీతి పై చర్చ ఊపందుకుంటున్న వేళ.. దానిపై పరోక్షంగా స్పందించాడు నటుడు, దర్శకుడు, నిర్మాత రవిబాబు. ఇండస్ట్రీలో తనకు తానుగా ఎంటరయ్యానని.. తన తండ్రి చలపతిరావు తనను ప్రోత్సహించలేదంటున్నాడు.

"నేను చాలా ఇండిపెండెంట్ గా పెరిగాను. మా నాన్న నన్ను అలా పెంచారు. నాపై ఏదీ రుద్దలేదు. నాతో ఎప్పుడూ ఏదీ డిస్కస్ చేయలేదు. ఇండస్ట్రీలోకి రమ్మని చెప్పలేదు, వద్దని చెప్పలేదు. అన్నీ నిర్ణయాలు నేనే తీసుకున్నాను. పిల్లల్ని పొగిడితే పాడైపోతారని అంతా అనుకుంటారు. కానీ వాళ్లను ప్రోత్సహిస్తే ఇంకా బాగా పనిచేస్తారు. నాకైతే మా నాన్న (చలపతిరావు) నుంచి అలాంటి ప్రోత్సాహాలు/మెచ్చుకోలు ఎప్పుడూ రాలేదు."

తండ్రి చలపతిరావు సినీ నేపథ్యం తనకు పెద్దగా కలిసిరాలేదంటున్నాడు రవిబాబు. ఒకసారి రామోజీరావు దగ్గరకు మాత్రం తీసుకెళ్లారని, అక్కడ కూడా తన టాలెంట్ నే నమ్ముకున్నానని అన్నాడు.

"మా నాన్న బ్యాక్ గ్రౌండ్ నాకు పెద్దగా ఉపయోగపడలేదు. ఆయన నన్ను రామోజీరావు గారి దగ్గరకు తీసుకెళ్లారు. రామోజీరావు గారి ఆఫీస్ డోర్ ఓపెన్ చేసేంత వరకు మాత్రమే నా బ్యాక్ గ్రౌండ్ ఉపయోగపడింది. లోపలికి వెళ్లిన తర్వాత నన్ను నేను నిరూపించుకున్నాను."

టాలెంట్ ఉండేవాడిదే ఇండస్ట్రీ అంటున్నాడు రవిబాబు. ఈ విషయంలో కుటుంబ నేపథ్యం కేవలం ఎంట్రీ వరకు మాత్రమే పనికొస్తుందని.. ఆ తర్వాత విషయం ఉంటేనే జనం చూస్తారని, లేకపోతే ఇంట్లో కూర్చోవడమే అంటున్నాడు. 

తండ్రి పాలిట రాక్షసిలా మారిన పూజా

చంద్రబాబు,ఈనాడు, ఆంధ్రజ్యోతిలపై పరువునష్టం దావా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?