పప్పు, ఉప్పు, చంబా, అంబా… వైసీపీలో మరో కొడాలి

ఇప్పటివరకూ చంద్రబాబుకి కానీ, లోకేష్ కి కానీ ప్రెస్ మీట్ లో చాకిరేవు పెట్టాలంటే దానికి కొడాలి నాని ఒక్కరే సరైనోడు అనే పేరుంది. కానీ ఇప్పుడా ప్లేస్ ని భర్తీ చేయడానికి వచ్చేశారు…

ఇప్పటివరకూ చంద్రబాబుకి కానీ, లోకేష్ కి కానీ ప్రెస్ మీట్ లో చాకిరేవు పెట్టాలంటే దానికి కొడాలి నాని ఒక్కరే సరైనోడు అనే పేరుంది. కానీ ఇప్పుడా ప్లేస్ ని భర్తీ చేయడానికి వచ్చేశారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. 

శ్రీకాకుళంకి చెందిన దువ్వాడ.. గతంలోనూ టీడీపీ నేతలపై ఘాటుగా మాట్లాడిన సందర్భాలున్నాయి. అయితే ఈసారి ఏకంగా చంబా, పప్పు, గంగిరెద్దు అంటూ.. డైరెక్ట్ గా రంగంలోకి దూకారు. అరేయ్, ఒరేయ్ అంటూ తండ్రీ కొడుకుల్ని చెడుగుడు ఆడుకున్నారు. సాక్షాత్తూ రాష్ట్ర గవర్నర్ ని, జిల్లా ఎస్పీని కూడా తూలనాడిన టీడీపీ నాయకులకు అలాంటి భాషతోనే సమాధానం చెబుతామని హెచ్చరించారు శ్రీనివాస్.

పోలవరం ముంపు ప్రాంతాల పరిశీలనకు లోకేష్ వెళ్లడాన్ని దువ్వాడ శ్రీనివాస్ తీవ్రంగా తప్పుబట్టారు. అసలు లోకేష్ కి పోలవరానికి సంబంధం ఉందా అంటూ నిలదీశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని మండిపడ్డారు. పోలవరానికి శంకుస్థాపన చేసింది వైఎస్సార్ అని, దాని పనుల్లో వేగం పెంచింది జగన్ అని చెప్పారు.

అచ్చెన్నకు అంతకు మించి..

చంద్రబాబు, లోకేష్ కి మాత్రమే చాకిరేవు అనుకుంటే పొరపాటే.. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సవాళ్లు విసిరిన అచ్చెన్నాయుడికి అంతకు మించి గడ్డిపెట్టారు ఎమ్మెల్సీ దువ్వాడ. విశాఖలో బికినీ షోలు పెట్టాలని చూసిన నీఛ సంస్కృతి చంద్రబాబుది అని మండిపడ్డారు. 

విశాఖ సంస్కృతి, సంప్రదాయాల్ని నాశనం చేసేందుకు టీడీపీ ప్రయత్నించిందని అన్నారు. విశాఖను పాలనా రాజధానిగా ప్రకటిస్తే అడ్డుకుంటున్నారని, ఓ గంగిరెద్దు అధ్యక్షతన సమావేశం పెట్టారని అచ్చెన్నను ఓ ఆటాడేసుకున్నారు.

కొడాలి బాధ్యతలు దువ్వాడకు..

అప్పట్లో లోకేష్ కి, చంద్రబాబుకి ప్రెస్ మీట్ పెట్టి మరీ చీవాట్లు పెట్టే మంత్రి కొడాలి నాని, ఈమధ్య ఎందుకో కాస్త సైలెంట్ అయ్యారు. ప్రతిపక్షం విరుచుకుపడుతున్నా కొడాలి మార్కు కౌంటర్లు మాత్రం పడలేదు. దీంతో దువ్వాడ లైన్లోకి వచ్చారు. 

కొడాలిని గుర్తుకు తెస్తూ, తనదైన స్టైల్ లో చంద్రబాబు, లోకేష్ పై ఫైర్ అయ్యారు. ఈ దెబ్బతో టీడీపీకి మరోసారి దిమ్మతిరిగినట్టయింది. వైసీపీకి మరో కొడాలి దొరికినట్టయింది.