హరీష్ సినిమా మళ్లీ లేటేనా?

హరి హర వీరమల్లు సినిమా మీద హీరో పవన్ కు ఆసక్తి తగ్గిందని గ్యాసిప్ లు వున్నాయి. క్రిష్ స్క్రిప్ట్ మీదనో, లేదా నిర్మాణం మీదనో పవన్ అసంతృప్తిగా వున్నారని వార్తలు వినవచ్చాయి. పైగా…

హరి హర వీరమల్లు సినిమా మీద హీరో పవన్ కు ఆసక్తి తగ్గిందని గ్యాసిప్ లు వున్నాయి. క్రిష్ స్క్రిప్ట్ మీదనో, లేదా నిర్మాణం మీదనో పవన్ అసంతృప్తిగా వున్నారని వార్తలు వినవచ్చాయి. పైగా భారీ ఫైట్లు వగైరా వున్న సినిమా ఇది. 

అలాంటివి అన్నీ ఇప్పుడు చేసే మూడ్ లో పవన్ లేరని బోగట్టా. ఇలాంటి నేపథ్యంలో తన సినిమాను జూలై నుంచి లేదా ఆగస్ట్ నుంచి ప్రారంభించేయవచ్చు అని ధీమాగా వున్నారు దర్శకుడు హరీష్ శంకర్.

కానీ ఆయన ఆశలు నెరవేరే అవకాశం కనిపించడం లేదు. వినోద సితం రీమేక్ ను త్వరలో సెట్ మీదకు తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. హీరోయిన్ ఎంపిక ఓ కొలిక్కి వస్తోంది. 

శ్రీలీల లేదా కేతికశర్మల పేర్లు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం విదేశాల్లో వున్న త్రివిక్రమ్ ఇక్కడకు రాగానే ఈ సినిమా వర్క్ ను సూపర్ వైజ్ చేస్తారు. మాటల రచయిత బుర్రా స్క్రిప్ట్ వర్క్ ను దాదాపు పూర్తి చేసారు. కొంత ఫైన్ ట్యూన్ వుంది.

పవన్ ఈ సినిమా కోసం రెండు వారాలు గ్రీన్ మ్యాట్ మీద, రెండు వారాలు మామూలుగా షూట్ చేయాలి. విడతలు విడతలుగా రెండు నెలల్లో అంటే జూలై చివరి నుంచి సెప్టెంబర్ లోగా ఫినిష్ చేస్తారు. ఆ తరువాతనే మళ్లీ క్రిష్ సినిమా వుంటే వుంటుంది. లేదంటే లేదు. అప్పటి పరిస్థితిని బట్టి హరీష్ శంకర్ సినిమా. లేదూ అంటే వైష్ణవ్ తేజ్ కాంబినేషన్ లో పవన్ సినిమా వుండే అవకాశం వుంది.