ఎవ్వరూ కామెంట్ చేయనంటే నటిస్తాను

తన యాక్టింగ్ కెరీర్ పై స్పందించారు ఒకప్పటి హీరోయిన్, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్. తను మళ్లీ నటిస్తే ఆడియన్స్ చూస్తారా చూడరా అనే భయం వల్లనే ఇన్నాళ్లూ కెమెరాకు దూరమయ్యానని అంటున్నారు…

తన యాక్టింగ్ కెరీర్ పై స్పందించారు ఒకప్పటి హీరోయిన్, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్. తను మళ్లీ నటిస్తే ఆడియన్స్ చూస్తారా చూడరా అనే భయం వల్లనే ఇన్నాళ్లూ కెమెరాకు దూరమయ్యానని అంటున్నారు రేణు. తనను కామెంట్ చేయకుండా ఉంటే నటిస్తానంటున్నారు.

“స్క్రీన్ పై నేను బాగా కనిపిస్తున్నానని అందరికీ అనిపిస్తే కచ్చితంగా చేస్తాను. ఎందుకంటే చాలా ఏళ్లయింది. కెమెరా ముందు నేను మంచిగా కనిపిస్తానా లేదా అనే భయం నాకు ఉంది. పైగా యాక్టింగ్ కంటే దర్శకత్వం గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నాను కాబట్టి ఆ భయం నాకు ఎప్పట్నుంచో ఉంది. మేకప్ వేసుకొని కెమెరా ముందుకొస్తే జనానికి నచ్చుతుందా అని అనుమానం. ఆవిడకెందుకు యాక్టింగ్ అని ఎవరైనా అంటారేమో అని భయం.”

నటనకు సంబంధించి  ఇలా తన మనసులో మాట బయటపెట్టారు రేణుదేశాయ్. రీసెంట్ గా ఓ టీవీ ప్రోమోలో నటించారు రేణుదేశాయ్. దానికి మంచి రెస్పాన్స్ వస్తోందని, కాబట్టి నటించగలననే నమ్మకం తనకు కలిగిందని చెప్పుకొచ్చారు. ఇక కొడుకు అకిరా కూడా కచ్చితంగా సినిమాల్లోకి వస్తాడంటున్నారు రేణు దేశాయ్.

“అకిరా కచ్చితంగా సినిమాల్లోకి వస్తాడు. ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబంలో పుట్టాడు కాబట్టి అతడు స్టార్ అయిపోడు. అకిరా తనను తాను ప్రూవ్ చేసుకోవాలి. కనీసం 5-6 సినిమాలు చేసి అతడు హిట్స్ కొట్టాలి. అప్పుడు నేను కూడా స్టార్ మదర్ అవుతాను.”

కేవలం టాలెంట్ ఉండి ఇండస్ట్రీలోకి వస్తే సరిపోదంటున్నారు రేణుదేశాయ్. చాలా మానసిక ధైర్యం కూడా కావాలని, ఎన్ని అవమానాలు, ఆటుపోట్లు ఎదురైనా తట్టుకొని నిలబడగలిగేంత మనోనిబ్బరం ఉండాలంటున్నారు. 

తండ్రి పాలిట రాక్షసిలా మారిన పూజా

చంద్రబాబు,ఈనాడు, ఆంధ్రజ్యోతిలపై పరువునష్టం దావా