క‌త్రినాతో వివాహ‌బంధంపై విక్కీ కౌశ‌ల్ స్పంద‌న‌!

బాలీవుడ్ న‌టి క‌త్రినా కైఫ్, న‌టుడు విక్కీ కౌశ‌ల్ ల వివాహ‌బంధం హ‌నీమూన్ పీరియ‌డ్ లా సాగుతూ ఉంది. త‌మ బంధానికి సంబంధించి అంద‌మైన ఫొటోల‌ను షేర్ చేస్తోంది ఈ జంట‌. స్విమ్మింగ్ పూల్…

బాలీవుడ్ న‌టి క‌త్రినా కైఫ్, న‌టుడు విక్కీ కౌశ‌ల్ ల వివాహ‌బంధం హ‌నీమూన్ పీరియ‌డ్ లా సాగుతూ ఉంది. త‌మ బంధానికి సంబంధించి అంద‌మైన ఫొటోల‌ను షేర్ చేస్తోంది ఈ జంట‌. స్విమ్మింగ్ పూల్ లో జ‌ల‌కాలాట‌ల‌ను సోష‌ల్ మీడియాలో త‌మ ఫాలోయ‌ర్ల‌కు షేర్ చేస్తోంది ఈ జంట‌. 

ఇక ఇలా వివాహ‌మాడిన తార‌లు త‌మ దాంప‌త్య‌బంధం ఎలా ఉంద‌నే అంశంపై కూడా స్పందిస్తూ ఉంటారు. ఈ క్ర‌మంలో విక్కీ కౌశ‌ల్ త‌మ వైవాహిక బంధం సాగుతున్న రీతి గురించి కాస్త స్పందించాడు. క‌త్రినాతో కాపురంలో తన ఆనంద‌మెలా ఉందో విక్కీ చెప్పుకొచ్చాడు.

త‌న జీవితంలోని ప్ర‌తి అంశంపైనా క‌త్రినా ప్ర‌భావం గొప్ప రీతిలో ఉంద‌ని అంటున్నాడు విక్కీ. క‌త్రినా లాంటి భార్య దొర‌క‌డం త‌న అదృష్టం అని చెప్పాడు. ఆమె చాలా ఇంటెలిజెంట్ అని, చాక‌చ‌క్యం క‌లిగిన‌ద‌ని, కంపాసినేట్ ప‌ర్స‌న్ అని త‌న భార్య గురించి చెప్పాడు. అనుదినం ఆమె నుంచి త‌ను ఎంతో నేర్చుకుంటున్న‌ట్టుగా ఈ న‌టుడు త‌న భార్య నుంచి త‌ను పొందుతున్న స్ఫూర్తిని వివ‌రించాడు.

మొత్తానికి బాలీవుడ్ హీరోయిన్ తో వివాహ‌బంధంలో హ్యాపీనెస్ ఉంద‌ని ఈ బాలీవుడ్ హీరో చెబుతున్నాడు. ఈ మాట‌లు వింటే ర‌ణ్ వీర్ సింగ్, దీపిక‌ల స్పంద‌న‌లు గుర్తు రాక మాన‌వు. వారు కూడా త‌మ వైవాహిక బంధం గురించి ఇలాంటి విశేషాలే చెబుతూ ఉంటారు.

అయినా తెలివైన అమ్మాయితో కాపురం క‌ష్ట‌మ‌నేది చాలా మంది మ‌గాళ్లు చెప్పే మాట‌! విక్కీ మాత్రం త‌న భార్య చాలా తెలివైనది కావ‌డం త‌న అదృష్టం అంటున్నాడు.. జ‌స్ట్ కిడ్డింగ్!