ప్రతిరోజూ పండగే.. దర్శకుడు మారుతి-హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న సినిమా. ఈ సినిమాలో హీరో తాతగా నటిస్తున్న సత్యరాజ్ పాత్ర కోసం ఓ మాంచి ఇల్లు కావాల్సి వచ్చింది. అయితే అలా అని అల్ట్రా మోడరన్ ఇల్లు కాదు. పాత-కొత్తల మేలు కలయికగా వుండే ఇల్లు. ఇలాంటి ఇల్లు దొరకక, ఆఖరికి నానక్ రామ్ గుడా స్టూడియోలో వున్న ఓ ఇంటిని తీసుకుని ఆర్ట్ డైరక్టర్ రవీందర్ మేకోవర్ చేసారు.
చాలాకాలంగా సాదా సీదాగా వున్న ఆ ఇంటి లుక్ నే మార్చేసారు. దాంతో ఇప్పుడు ఇండస్ట్రీ దృష్టి ఆ ఇంటిమీదకు మళ్లింది. ఇప్పటికే ఇండస్ట్రీ జనాలు కొంతమంది కేవలం ఆ ఇల్లు చూడ్డానికి వెళ్లి రావడం విశేషం. సినిమాలో చాలావరకు సన్నివేశాలు ఈ ఇంట్లోనే జరుగుతాయి. వాస్తవానికి ఈ ఇల్లు గోదావరి జిల్లాలో వున్నట్లు ప్రొజెక్ట్ చేస్తారు. బయట సీన్లు, ఊరి సీన్లు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈనెల తరువాత పిక్చరైజ్ చేస్తారు.
ధమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా కథానాయిక. బన్నీవాస్ నిర్మాత. యువి క్రియేషన్స్ భాగస్వామి.