ఎంపీగా గెలిచి పార్లమెంట్ లో చర్చించాల్సిన నేత తహసీల్దార్ అవతారం ఎత్తడమేంటి. అంటే అదే నిజం. ఆయన అచ్చమైన తహసీల్దార్ గా మారిపోయారు. అది కూడా బ్రిటిష్ కాలం నాటి తహసీల్దారు. అంటే ఆ గెటపే వేరుగా ఉంటుంది.
ఇంతకీ అలా ఎందుకు మారారు. ఎవరా ఎంపీ అంటే ఆయనే విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. ఆయన పూర్వాశ్రమంలో సినీ నిర్మాత కూడా. ఆయనకు కళలంటే మక్కువ ఎక్కువ.
ఇక ఒకే ఒక్కడు అల్లూరి సీతారామరాజు అన్న సినిమాను విశాఖ విజయనగరం జిల్లాలకు చెందిన కొంతమంది ఔత్సాహికులు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో కీలకమైన బ్రిటిష్ తహసీల్దార్ పాత్రలో ఎంవీవీ సత్యనారాయణ కనిపించనున్నారు.
ఆయన దీని కోసం ముఖానికి మేకప్ వేసుకుంటే ఆయన అనుచరులు, వైసీపీ కార్యకర్తలు కూడా ఆయన్ని ఎవరో గుర్తు పట్టలేకపోయారు. ఈ షూటింగ్ మూడు రోజుల పాటు ఉంటుందని, ఎంవీవీ తనకి ఇచ్చిన పాత్రలో ఒదిగిపోవడమే కాకుండా సినిమా సాఫీగా రావడానికి అందిస్తున్న సహకారం మరువలేమని చిత్ర యూనిట్ చెబుతోంది.
మొత్తానికి ఒక విప్లవవీరుడి సినిమా తెలుగు వారిని తొందరలోనే అలరించనుంది అన్న మాట.