రాయలసీమ కీలక ప్రాజెక్టులకు నీరు వచ్చేది పోతిరెడ్డిపాడు నుంచే దానికి నీరు అందాలంటే శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగులు నీరు నిల్వ ఉండాలి. శ్రీశైలం నిర్మాణం చేసినప్పుడు అదే నిబంధనలు ఉన్నాయి. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జీఓ 69 ని అమలు చేయడం ద్వారా 834 అడుగులకు కుదించారు. దాంతో రాయలసీమ ప్రాజెక్టులకు నీరు అందని పరిస్థితి ఏర్పడింది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత జీఓ 107 తీసుకొచ్చిన వైయస్ తిరిగి 854 అడుగులుగా పునరుద్ధరణ చేశారు. అంతే కాదు పోతిరెడ్డిపాడు వెడల్పు చేయడం కీలక అవసరం కనుక 44 వేల క్కుసేక్కులకు పెంచారు.
ఈ సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన దేవినేని ఉమామహేశ్వరరావు విజయవాడ కేంద్రంగా చేసుకుని కృష్ణా డెల్టా రైతులను రెచ్చగొట్టి రాయలసీమకు నీరు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే కృష్ణలో ప్రవహించేది నీరు కాదు రక్తం అంటూ బెదిరింపు రాజకీయాలు చేశారు. వీరికి తెలంగాణ నేతలు తోడు నిలిచారు చంద్రబాబు తమ నేతను కనీసం నివారించేందుకు ప్రయత్నం చేయలేదు. వైయస్ పోతిరెడ్డిపాడును పూర్తి చేశారు 69ని రద్దు చేయలేకపోయారు. ప్రయత్నం చేసి చేయలేకపోయి వైయస్ రాయలసీమకు అన్యాయం చేసినట్లా ? అడ్డుకున్న తెలుగుదేశం అన్యాయం చేసిందా ?
కనీసం తప్పు చేసామన్న ఆత్మవిమర్శ చేసుకోకుండా మీరు రద్దు చేయండి అంటూ ఎదురుదాడి. రోశయ్య , కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు రద్దు చేయలేదు అంటూ ప్రశ్నలు వైయస్ లాంటి బలమైన నేతనే అడ్డుకున్న వారు వీరిని చేయనిస్తారా ? ఇప్పుడు జగన్ చేయాలి అంటూ సలహాలు. రాష్ట్రం విడిపోయి తర్వాత శ్రీశైలం , నాగార్జున సాగర్ లు రెండు రాష్ట్రాలకు చెందినవి నిర్ణయం తీసుకునే అధికారం ఒక రాష్టానికి ఉండదు.
తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటే కదా జగన్ ప్రభుత్వం KRMB , సుప్రీంకోర్టు కు వెల్లింది. చేయాల్సిన అన్యాయం చేసి కనీస ఆత్మపరిశీలన కూడా చేసుకోకుండా మేము చేశాము మీరు సరిదిద్దుకోండి అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. తెలుగుదేశం శ్రేణులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని రాయలసీమ సమాజం తిప్పుకొట్టాలి.
మాకిరెడ్డి పురుషోత్తమ్ రెడ్డి