‘రోజ్ మిల్క్’ టీజర్

ఈ మధ్యకాలంలో ఫీల్ గుడ్, క్యూట్ లవ్ స్టోరీలు రావడం తగ్గింది. అలాంటి వస్తే చూసే ఆసక్తి మాత్రం తగ్గలేదు. లేతవయసు అమాయకపు ప్రేమ కథను ఎంతో ఫ్రెష్ కంటెంట్‌ అందిస్తున్న క్లారిటీ ఇచ్చింది…

ఈ మధ్యకాలంలో ఫీల్ గుడ్, క్యూట్ లవ్ స్టోరీలు రావడం తగ్గింది. అలాంటి వస్తే చూసే ఆసక్తి మాత్రం తగ్గలేదు. లేతవయసు అమాయకపు ప్రేమ కథను ఎంతో ఫ్రెష్ కంటెంట్‌ అందిస్తున్న క్లారిటీ ఇచ్చింది ఈ రోజు విడుదలైన రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా టీజర్. 

జై జాస్తి, అవంతిక జంటగా నటిస్తున్న చిత్రం రాజమండ్రి రోజ్‌మిల్క్. నాని బండ్రెడ్డి దర్శకుడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి ఇంట్రూప్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. డి.సురేష్‌బాబు, ప్రదీప్ ఉప్పలపాటి నిర్మాతలు.

ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం విడుదల చేసింది చిత్రబృందం. దర్శకుడు మాట్లాడుతూ టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ఫ్రెష్ కంటెంట్‌తో వస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇది. కాలేజి రోజుల్లో మరపురాని సంఘటనలను, మధురానుభూతులను ఈ చిత్రం అందరికి జ్ఞప్తికి తెస్తుంది. 

సినిమా చూసిన ప్రతి ఒక్కరికి మంచి సినిమా చూశామన్న అనుభూతి కలుగుతుంది అన్నారు. సన్నీల్‌కుమార్, వెన్నెలకిషోర్, ప్రవీణ్, ప్రణీత్ పట్నాయక్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోవింద్ వసంత్, అజయ్ అరసాడ, యశ్వంత్ నాగ్, భరత్-సౌరభ్,డిఓపీ: శక్తి అరవింద్, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్.