తెలంగాణ బీజేపీకి షాక్ మీద షాక్ లు తగులుతున్నాయి. సీనియర్ నేతలు ఒకొక్కరుగా పార్టీ వీడుతున్నారు. ఇవాళ సీనియర్ నేత దాసోజ్ శ్రవణ్ బీజేపీ పార్టీకి గుడ్ బై మర్చిపోక ముందే మరో నేత పార్టీ వీడాటానికి సిద్ధం అయ్యారు. తాజాగా మాజీ మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ బీజేపీకి రాజీనామా చేశారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో చురుగ్గా ఉన్న స్వామిగౌడ్.. 2013 లో టీఆర్‌ఎస్‌లో చేరి క్రియాశీలకంగా పని చేశారు. 2014లో జరిగిన కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఘనవిజయం సాధించారు. టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో 2014, జూలై 2న తెలంగాణ శాసన మండలి తొలి ఛైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.
2020లో వ్యక్తిగత కారణాలతో టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన స్వామి గౌడ్ తర్వాత బీజేపీలో చేరారు. కానీ బీజేపీలో ఇమడలేక రెండేళ్లకే బయటకు వచ్చారు. తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజాయ్ కి లేఖ ద్వారా తెలియజేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించడంలో బీజేపీ విఫలమైందని, బీజేపీలో ధనవంతులు, కాంట్రాక్టర్లకే ప్రాతినిధ్యం అధికంగా ఉందని పేర్కొన్నారు. బలహీన వర్గాల ఉన్నతికి బీజేపీ సహకరించడం లేదని రాజీనామా లేఖలో తెలియజేశారు.
మొత్తానికి మాజీ నేతలు అందరూ టీఆర్ఎస్ వైపు రావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సహని నింపుతున్నాయి. మునుగోడులో ఎలగైనా గెలవలని పట్టదలతో ఉన్న టీఆర్ఎస్ నేతలు బీజేపీ నుండి నాయకుల చేరికలను పొత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సీఎం కేసీఆర్ సమక్షంలో స్వామి గైడ్ టీఆర్ఎస్ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది.