ఓటిటి వైపు సినిమాల చూపు

కరోనా నేపథ్యంలో థియేటర్ వైపు నుంచి ఓటిటి వైపు సినిమాలు చూడడం ప్రారంభించాయి. కానీ ఇప్పటి వరకు తెలుగులో సరైన సినిమా ఓటిటికి వెళ్లలేదు.  నిశ్శబ్దం, మిస్ ఇండియా లాంటి సినిమాలు దాదాపు ఓటిటి…

కరోనా నేపథ్యంలో థియేటర్ వైపు నుంచి ఓటిటి వైపు సినిమాలు చూడడం ప్రారంభించాయి. కానీ ఇప్పటి వరకు తెలుగులో సరైన సినిమా ఓటిటికి వెళ్లలేదు.  నిశ్శబ్దం, మిస్ ఇండియా లాంటి సినిమాలు దాదాపు ఓటిటి దారిలోనే వున్నాయని, కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇదిగో అదిగో అంటున్నాయి కానీ ఓటిటి తీరం మాత్రం చేరడం లేదు.

ఇదిలా వుంటే మరి కొన్ని సినిమాలు కూడా జస్ట్ అటు కూడా ఓ కన్నేసి వుంచినట్లు తెలుస్తోంది. రవితేజ 'క్రాక్', రామ్ 'రెడ్', సాయితేజ్ 'సోలో బతుకు' కూడా ఎంక్వయిరీలు జరుగుతున్నట్లు టాలీవుడ్ లో వినిపిస్తోంది. మొన్నటి వరకు ఆగస్టు నుంచి సినిమాలు వుంటాయని వినిపించింది. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే వుండొచ్చు, వుండకపోవచ్చు అని వినిపిస్తోంది.

నిజానికి ఈ మూడు సినిమాలు థియేటర్ మార్కెట్ ను ఎప్పుడో ఫినిష్ చేసేసుకున్నాయి.  అలాగే డిజిటల్, శాటిలైట్ కూడా. కానీ ఇప్పుడు ఓటిటి ఫ్లాట్ ఫారమ్ ల వైపు నుంచే ఎంక్వయిరీలు వస్తున్నాయని, నిర్మాతలు మాత్రం ఎటూ డిసైడ్ చేసుకోలేకపోతున్నారని తెలుస్తోంది.

థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో అన్నది క్లారిటీగా తెలియకపోవడం, బయ్యర్లు కమిట్ మెంట్ లకు కట్టుబడి వుంటారా? అన్న అనుమానం, అలాగే గతంలో మాదిరిగా ఎన్ ఆర్ ఎ లు చేస్తారా? కేవలం అడ్వాన్స్ ల మీద ఆడిస్తామంటారా? అన్నది తెలియకపోవడం వంటివి ఓటిటి వైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయి. కానీ అదే సమయంలో థియేటర్ కు వెళ్తే సినిమా క్లిక్ అయితే డబ్బులు బాగా వస్తాయన్న ఆలోచన వెనక్కు లాగుతోంది. ఏమైనా ముందు నిశ్శబ్దం, మిస్ ఇండియా వ్యవహారాలు తెగితే, అప్పుడు ఓటిటి సినిమాల విషయంలో కదలిక రావచ్చు. 

మనది గొప్ప దేశం.. చైనాకి బుద్ధి చెబుదాం

చైనాకి బుద్ధి చెబుదాం