సుశాంత్ గ‌ర్ల్‌ఫ్రెండ్ కొత్త వాద‌న‌

బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య దేశ చిత్ర ప‌రిశ్ర‌మ‌నే షాక్‌కు గురి చేసింది. సుశాంత్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత బాలీవుడ్‌తో పాటు వివిధ చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లో చోటు చేసుకున్న అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌ల‌పై త‌మ‌త‌మ అనుభ‌వాల‌ను…

బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య దేశ చిత్ర ప‌రిశ్ర‌మ‌నే షాక్‌కు గురి చేసింది. సుశాంత్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత బాలీవుడ్‌తో పాటు వివిధ చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లో చోటు చేసుకున్న అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌ల‌పై త‌మ‌త‌మ అనుభ‌వాల‌ను ధైర్యంగా వెల్ల‌డిస్తున్నారు.

సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌పై ద‌ర్యాప్తు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. ఆత్మ‌హ‌త్య‌కు ప్రేరేపించిన ప‌రిస్థితులపై పోలీసుల ద‌ర్యాప్తు వేగంగా సాగుతోంది. విచార‌ణ‌లో భాగంగా సుశాంత్ గ‌ర్ల్ ఫ్రెండ్ రియాని సంచ‌ల‌న విష‌యాలు చెప్పుకొచ్చింది.

ఇప్పుడు ఆమె స‌రికొత్త వాద‌న సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. సుశాంత్ ఇంట్లో దెయ్యం ఉందని, కలిసి ఉన్నప్పుడు  ఏవో శక్తులు ఉన్నట్టు అనిపించిందని ఆమె విచార‌ణ‌లో వెల్ల‌డించింది. సుశాంత్ .. యశ్‌ రాజ్ ఫిల్మ్స్ తో మొత్తం మూడు సినిమాలు ఒప్పందం చేసుకున్నాడని, వాటిలో రెండు పూర్తి చేశాడ‌ని తెలిపింది. అలాగే మరో సినిమా రద్దు చేసుకున్న‌ట్టు రియాని చెప్పింది.

తనను కూడా యశ్‌ రాజ్ ఫిలిమ్స్ తో సినిమాలు త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించాడని ఆమె వెల్లడించింది రియా. దాదాపు 9 గంటలపాటు రియాని పోలీసులు విచారించారు. ఈ విచార‌ణ‌లో ఆమె నుంచి ఆస‌క్తిక‌ర విష‌యాలు రాబ‌ట్టారని స‌మాచారం. మ‌రి అవి సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌లో కీల‌క అంశాల వెల్ల‌డికి ఏ మాత్రం ఉప‌యోగ‌ప‌డ‌తాయో చూడాలి. 

చైనాకి బుద్ధి చెబుదాం

మనది గొప్ప దేశం.. చైనాకి బుద్ధి చెబుదాం