జూలై నుంచి ఐనాక్స్?

కరోనా భయం అలాగే వున్నా, ఎప్పుడు థియేటర్లు ఓపెన్ చేస్తారా? అని చూస్తున్నారు సినిమా ప్రియులు.  కానీ సింగిల్ ధియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయన్న దాని మీద అస్సలు క్లారిటీ లేదు. అయితే ఐనాక్స్, పివిఆర్…

కరోనా భయం అలాగే వున్నా, ఎప్పుడు థియేటర్లు ఓపెన్ చేస్తారా? అని చూస్తున్నారు సినిమా ప్రియులు.  కానీ సింగిల్ ధియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయన్న దాని మీద అస్సలు క్లారిటీ లేదు. అయితే ఐనాక్స్, పివిఆర్ చేయిన్ థియేటర్ల జూలై రెండో వారం తెరుచుకునే అవకాశం వుందని తెలుస్తోంది. 

రెండు హాలీవుడ్ సినిమాల విడుదల నేపథ్యంలో, ప్రతి మల్టీ ఫ్లెక్స్ ల్లో ఒక స్క్రీన్ ను తెరిచే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశం మొత్తం మీద ఐనాక్స్, పివిఆర్ మల్టీ ఫ్లెక్స్ లు వున్నాయి. ఒక్కో స్క్రీన్ వంతున తెరిచినా పెద్ద సంఖ్యలో స్క్రీన్ లు అందుబాటులోకి వస్తాయి.

హాలీవుడ్ సినిమాల తరువాత పరిస్థితిని బట్టి, ఇండియన్ సినిమాల ప్రదర్శనతో స్క్రీన్ లు కొనసాగించే అవకాశం వుంది. తెలుగునాట కూడా సినిమా థియేటర్లు ఆగస్టు నుంచి తెరుచుకుంటాయని వినిపిస్తోంది. బహుశా ఐనాక్స్ థియేటర్లు ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే జూలై రెండో వారం నుంచి హాలీవుడ్ సినిమాలతో ప్రారంభించాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది.

మరో 30ఏళ్ళు నువ్వే ఉండాలన్నా

చైనాకి బుద్ధి చెబుదాం