కాంగ్రెస్ చీఫ్ గా ఖర్గే ఘన విజయం!

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా మల్లికార్జున ఖ‌ర్గే ఘన విజయం సాధించారు. అందరూ ఉహించ్చినట్లే మల్లికార్జున ఖ‌ర్గే భారీ మెజార్టీతో విజ‌యం సాధించారు. 6800ఓట్ల‌కు పైగా మోజార్టీతో ఖ‌ర్గే విజ‌యం సాధించారు. ఖ‌ర్గే కు 7897ఓట్లు…

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా మల్లికార్జున ఖ‌ర్గే ఘన విజయం సాధించారు. అందరూ ఉహించ్చినట్లే మల్లికార్జున ఖ‌ర్గే భారీ మెజార్టీతో విజ‌యం సాధించారు. 6800ఓట్ల‌కు పైగా మోజార్టీతో ఖ‌ర్గే విజ‌యం సాధించారు. ఖ‌ర్గే కు 7897ఓట్లు రాగా, శ‌శి ధ‌రూర్ కు 1072 ఓట్లు వ‌చ్చిన‌ట్లు ఎన్నిక‌ల అధికారులు ప్ర‌క‌టించారు.

2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ పదవీ విరమణ చేసినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు ఉన్న‌ సోనియా గాంధీ నుండి ఖర్గే బాధ్యతలు స్వీకరించనున్నారు. దాదాపు 137 ఏళ్ల చరిత్రలో పార్టీ అధ్యక్ష పదవిని ఎవరు చేపట్టాలనే ఎన్నికలు జ‌ర‌గ‌డం ఇది ఆరోసారి. 

ఖర్గే విజయం సాధించినందుకు అభినందనలు తెలుపుతూ ధ‌రూర్ ఇలా ట్వీట్ చేశారు 'కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఖ‌ర్గే ఉండటం గొప్ప గౌరవం మరియు పెద్ద బాధ్యత అని ఈ పనిలో ఖర్గే జీ విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అంటూ ట్వీట్ చేశారు.

ఖ‌ర్గే గాంధీ కుటుంబం విధేయుడుగా ముద్ర ప‌డినా నేప‌ధ్యంలో అధ్య‌క్ష భాద్య‌త‌లు త‌రువాత ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకోబోతున్నారనేది స‌స్పెన్స్. పార్టీ మ‌నుగ‌డ‌ కోసం పాద‌యాత్ర చేస్తున్నా రాహుల్ గాంధీకి నాయ‌కుల నుండి మంచి స‌పోర్టు వ‌స్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ మంచి విజ‌యం సాధించే ఆవకాశం ఉందంటూన్నారు విశ్లేష‌కులు.