పుష్ప 2.…కేజిఎఫ్ 2…అదే తేడా

ఆర్ఆర్ఆర్ కు కేజిఎఫ్ 2 కి ఏమిటి తేడా అంటే సక్సెస్ కన్నా బడ్జెట్ కీలకం. అంత పెద్ద సక్సెస్ తో కంపార్ చేసుకుంటే అంత తక్కువ బడ్జెట్ అన్నది ఇంకా కీలకం. వంద…

ఆర్ఆర్ఆర్ కు కేజిఎఫ్ 2 కి ఏమిటి తేడా అంటే సక్సెస్ కన్నా బడ్జెట్ కీలకం. అంత పెద్ద సక్సెస్ తో కంపార్ చేసుకుంటే అంత తక్కువ బడ్జెట్ అన్నది ఇంకా కీలకం. వంద రూపాయల పెట్టుబడి పెట్టి నూటయాభై తెచ్చామా? సంపాదించామా? యాభై రూపాయల పెట్టుబడితో నూట యాభై తెచ్చుకున్నామా? అన్నది పాయింట్. అలా అని క్వాలిటీలో ఏమైనా తేడానా అంటే అదీ లేదు. కుర్రాళ్లు..కొత్తగా పని నేర్చుకున్నవాళ్లు పనిచేసిన సినిమా కేజిఎఫ్ 2.

ఇప్పుడు ఇంతకీ ఈ ప్రస్తావన ఎందుకుంటే పుష్ప సినిమా సూపర్ డూపర్ హిట్. ఆ సినిమా కోసం ఎంత బడ్జెట్ పెట్టారు. ఎంత వచ్చింది అన్నది లెక్క వేయడం అనవసరం ఎందుకంటే ఆ సినిమా రేంజ్ తెలియకముందే హక్కులు అన్నీ తక్కువకు అమ్మేసుకున్నారు. అందువల్ల అక్కడ కుదరలేదు. కానీ పుష్ప 2 విషయంలో భారీ అంకెలు కచ్చితంగా వుంటాయి. ఇలాంటి అలాంటి అంకెలు కాదు. భారీ అంటే భారీ. అందువల్ల పుష్ప లో తక్కువైనది పుష్ప 2లో సంపాదించుకోవచ్చు.

కానీ చూస్తుంటే పుష్ప 2 ఆదాయం ఎంత వుండబోతోందో, ఖర్చు అంతకు అంతా వుండేలా కనిపిస్తోంది. సినిమా కోసం లోకేషన్ల వెదుకులాటతో ఖర్చు మొదలైంది. సరే, అది తప్పదు. సినిమా కు ఇటీవల హీరో ఫొటో షూట్ చేసారు. ఇందుకోసం బాలీవుడ్ ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్ ను రప్పించాల్సి వచ్చింది. ఖర్చు ఏ రేంజ్ లో వుంటుందన్నది మైత్రీకే తెలుసు. అది చాలదన్నట్లు, మన దగ్గర డిజైనర్లు సరిపోరు అన్నట్లు పోస్టర్ డిజైనర్ ను సైతం అక్కడి నుంచే తీసుకువచ్చారు.

అంటే ఇంత బేసిక్ వర్క్ దగ్గర నుంచే ఆల్ ఇండియా ఫేమ్ టెక్నీషియన్లను వాడడం ప్రారంభించారు అంటే ఇక పుష్ప 2 కి ఖర్చు ఏ రేంజ్ లో వుండబోతోందో అర్థం అయిపోతోంది. నిజానికి పుష్ప 2 విషయంలో రెమ్యూనిరేషన్లు భారీగానే వుంటాయి. డైరక్టర్, హీరో, హీరోయిన్ల దగ్గర నుంచి కింద వరకు. ఎందుకంటే సక్సెస్ ఫుల్ సినిమాకు సీక్వెల్ కనుక. అది చాలక, ఇప్పుడు మరింత యాడ్ చేసుకుంటూ వెళ్లిపోతే ఖర్చు తడిసి మోపెడైపోతుంది. అప్పుడు ఎంత భారీ భారీ రేట్లు వచ్చినా నిర్మాతకు మిగిలేదేమిటి? అన్న క్వశ్చనే మిగులుతుంది.